క్రొయేషియాలో భారత ఎంబసీపై దాడి.. ఎంఈఏ తీవ్ర అభ్యంతరం
ABN , Publish Date - Jan 22 , 2026 | 05:35 PM
జాగ్రెబ్‌లోని భారత రాయబార కార్యాలయంలోకి కొందరు ఖలిస్థాన్ వేర్పాటువాదులు చొరబడి విధ్వంసం సృష్టించినట్టు గురువారం ఉదయం వార్తలు వెలువడ్డాయి. భారత రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనేందుకు ఈయూ నేతలు న్యూఢిల్లీలో పర్యటించనున్నమ వేళ ఈ ఘటన చోటుచేసుకుంది.
న్యూఢిల్లీ: ఐరోపా దేశం క్రొయేషియా (Croatia) రాజధాని జాగ్రెబ్‌లోని భారత రాయబార కార్యాలయంలోకి ఖలీస్థానీ వేర్పాటువాదులు చొరబడి విధ్వంసం సృష్టించడంపై భారత్ ఘాటుగా స్పందించింది. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని భారత విదేశాంగ శాఖ (MEA) ఒక ప్రకటనలో కోరింది.
వియన్నా తీర్మానం ప్రకారం దౌత్య ప్రాంగణంలో నిబంధనల ఉల్లంఘన జరగరాదని, ఆయా ప్రాంతాల్లో తప్పనిసరిగా రక్షణ కల్పించాల్సి ఉంటుందని ఎంఈఏ పేర్కొంది. 'భారత వ్యతిరేక శక్తులు మా రాయబార కార్యాలయంలో చొరబడి విధ్వంసం సృష్టించిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ వ్యవహారాన్ని ఢిల్లీ, జాగ్రెబ్‌లోని క్రొయేషియా అధికారుల దృష్టికి తీసుకు వెళ్లాం. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరాం. ఇలాంటి ఘటనలు వాటి వెనుక ఉన్న వ్యక్తుల స్వభావం, ఉద్దేశాలను సూచిస్తాయి. చట్టాన్ని అమలుచేసే సంస్థల అధికారులు వీటిపట్ల అప్రమత్తంగా ఉండాలి' ఎంఈఏ పేర్కొంది.
కాగా, జాగ్రెబ్‌లోని భారత రాయబార కార్యాలయంలోకి కొందరు ఖలిస్థాన్ వేర్పాటువాదులు చొరబడి విధ్వంసం సృష్టించినట్టు గురువారం ఉదయం వార్తలు వెలువడ్డాయి. భారత రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనేందుకు ఈయూ నేతలు న్యూఢిల్లీలో పర్యటించనున్న వేళ ఈ ఘటన చోటుచేసుకుంది.
క్రొయోషియాలో మోదీ పర్యటన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత ఏడాది క్రొయేషియాలో పర్యటించారు. ఆ దేశంలో పర్యటించిన తొలి భారత ప్రధానిగా కూడా ఆయన రికార్డును సొంతం చేసుకున్నారు. జాగ్రెబ్‌లో మోదీకి క్రొయేషియా ప్రధాని ఆండ్రెజ్ ప్లెంకోవిక్ సాదర స్వాగతం పలికారు. ద్వైపాక్షిక సమావేశంలో ఇరువురు నేతలు పాల్గొన్నారు. భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీలు కూడా హాజరయ్యారు. మోదీ పర్యటనలో వ్యవసాయం, సంస్కృతి, సైన్స్ రంగాల్లో నాలుగు ఎంఓయూలపై సంతకాలు .జరిగాయి.
ఈ వార్తలు కూడా చదవండి.
ముంబై మేయర్ పదవి మహిళకే.. లాటరీ ప్రక్రియపై ఉద్ధవ్ శివసేన అభ్యంతరం
రాజుల పాలనలా దేశాన్ని మార్చాలనుకుంటున్నారు: రాహుల్
Read Latest National News