Share News

Rinku Singh Vijay Hazare Trophy: చెలరేగి ఆడిన రింకూ సింగ్..

ABN , Publish Date - Dec 25 , 2025 | 03:12 PM

భారత యువ హిట్టర్ రింకూ సింగ్ వచ్చే ఏడాదిలో జరిగే టీ20 ప్రపంచ కప్ కు ఎంపికనై సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ్ హజారే టోర్నీ 2025-26లో తాజాగా శుభారంభం చేశాడు.

 Rinku Singh Vijay Hazare Trophy: చెలరేగి ఆడిన రింకూ సింగ్..
Rinku Singh,

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా నయా ఫినిషర్ రింకూ సింగ్(Rinku Singh) దేశవాళీ టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీ ( Vijay Hazare Trophy )2025-26 సీజన్ ను విజయవంతంగా ఆరంభించాడు. ఉత్తరప్రదేశ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రింకూ సింగ్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లు అదరగొట్టాడు. ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’లో భాగంగా రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన పోరులో యూపీ 84 పరుగుల తేడాతో హైదరాబాద్‌ (HYD vs UP)పై విజయం సాధించింది. టాస్‌ ఓడిన యూపీ మొదట బ్యాటింగ్‌ చేసింది.‌ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 324 పరుగులు సాధించింది. యూపీ బ్యాటర్లలో ధ్రువ్‌ జురేల్‌ (61 బంతుల్లో 80 పరుగులు), ఆర్యన్‌ జుయల్‌ (96 బంతుల్లో 80 పరుగులు), అభిషేక్‌ గోస్వామి (81 బంతుల్లో 81 పరుగులు), కెప్టెన్‌ రింకూ సింగ్‌ (48 బంతుల్లో 67 పరుగులు) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. రింకూ సింగ్(Rinku Singh) వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ 2026కు ఎంపికైన సంగతి తెలిసిందే.


ఇక హైదరాబాద్‌ బౌలర్లలో అర్ఫాజ్‌ అహ్మద్‌ 2 వికెట్లు సాధించగా.. రక్షణ్‌ రెడ్డి, తనయ్‌ త్యాగరాజన్, నితిన్‌ సాయి యాదవ్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. అనంతరం 325 పరుగుల ఛేదనలో బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్‌ 43 ఓవర్లలో 240 పరుగులకే ఆలౌటైంది. దీంతో 84 పరుగుల తేడాతో ఉత్తరప్రదేశ్‌(‌Uttar Pradesh cricket team) జట్టు హైదరాబాద్ పై విజయం సాధించింది. హైదరాబాద్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (53 పరుగులు) హాఫ్‌ సెంచరీ టాప్ స్కోరర్ గా నిలిచాడు.


అలానే రాహుల్‌ బుద్ధి (47పరుగులు), వరుణ్‌ గౌడ్‌ (45 పరుగులు) ఫర్వాలేదనిపించారు. యూపీ బౌలర్లలోజీషాన్‌ అన్సారీ 4 వికెట్లు పడగొట్టి.. హైదరాబాద్ ఓటమిలో కీలక పాత్రపోషించాడు. అతడికి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. ఇదే గ్రూప్‌లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో జమ్మూకశ్మీర్‌ 10 వికెట్ల తేడాతో చండీగఢ్‌పై విజయం సాధించింది. అలానే బరోడా 5 వికెట్ల తేడాతో అస్సాంపై గెలవగా.. బెంగాల్‌ 3 వికెట్ల తేడాతో విదర్భపై విక్టరీ నమోదు చేసింది.


ఇవీ చదవండి:

మద్యం మత్తులో ఇంగ్లండ్ క్రికెటర్స్.. తొలిసారి స్పందించిన స్టోక్స్

బాదుడే బాదుడు.. 36 బంతుల్లోనే వైభవ్ సూపర్ సెంచరీ

Updated Date - Dec 25 , 2025 | 03:12 PM