Team India: భారత బ్యాటర్ల రికార్డ్ బ్రేకింగ్ ఇన్నింగ్స్.. బీసీసీఐ పోస్ట్ చేసిన వీడియో
ABN , Publish Date - Dec 25 , 2025 | 10:27 AM
భారత బ్యాటర్లు విధ్వంసకర బ్యాటింగ్ చేస్తున్నారు. ఇటీవల వాళ్లు సాధించిన సెంచరీలు, అద్భుతమైన ఇన్నింగ్స్ లకు సంబంధించిన వీడియోలను బీసీసీఐ పోస్ట్ చేసింది. వీటిలో భారత బ్యాటర్లు సూర్యవంశీ, రోహిత్, కోహ్లీ సూపర్ సెంచరీల వీడియోలు ఉన్నాయి.
ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 25: భారత బ్యాటర్ల విధ్వంసకర బ్యాటింగ్ వీడియోలను బీసీసీఐ పోస్ట్ చేసింది. వీటిలో సూర్యవంశీ ర్యాపిడ్ సెంచరీ.. రోహిత్, కోహ్లీ సూపర్ సెంచరీల వీడియోలు ఉన్నాయి. ఆ దుమ్ములేపే ఇన్నింగ్స్ ఇప్పుడు వైరల్ వీడియోలుగా మారాయి.
విజయ్ హజారే ట్రోఫీలో భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీలతో విధ్వంసం సృష్టించారు. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ వేగవంతమైన సెంచరీతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ రికార్డు బ్రేకింగ్ ఇన్నింగ్స్ హైలైట్స్‌ను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
రోహిత్ శర్మ ముంబై తరపున సిక్కింపై 155 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ ఆడగా, విరాట్ కోహ్లీ ఢిల్లీ తరపున ఆంధ్రప్రదేశ్‌పై 131 పరుగులతో చెలరేగాడు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 52 బంతుల్లో సెంచరీ బాది ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ ముగ్గురి విధ్వంసకర బ్యాటింగ్ హైలైట్స్‌తో నిండిన వీడియోలను బీసీసీఐ షేర్ చేసింది.