Share News

Maoist Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. కీలక మావోల హతం..

ABN , Publish Date - Jan 18 , 2026 | 07:25 PM

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో గత రెండు రోజులుగా భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య తీవ్ర స్థాయిలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ రోజు జరిగిన ఆపరేషన్‌లో ఇద్దరు కీలక మావోయిస్టులు హతమయ్యారు.

Maoist Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. కీలక మావోల హతం..
Maoist Encounter

ఛత్తీస్‌గడ్, జనవరి18 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో రెండు రోజులుగా భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య తీవ్ర స్థాయిలో ఎదురుకాల్పులు (Maoist Encounter) కొనసాగుతున్నాయి. ఆదివారం జరిగిన ఆపరేషన్‌లో ఇద్దరు కీలక మావోయిస్టులు మరణించారు. శనివారం నలుగురు మృతి చెందారు.

ఘటన వివరాలిలా..

బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం ఉందన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. తాజాగా జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. అంతకుముందు శనివారం నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్‌లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. దీంతో రెండు రోజుల్లో మరణించిన మావోయిస్టుల సంఖ్య 6కు చేరింది.


ముమ్మరంగా సెర్చ్ ఆపరేషన్..

నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు భద్రతా బలగాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి. శనివారం ప్రారంభమైన ఈ భారీ సెర్చ్ ఆపరేషన్ ఆదివారం కూడా కొనసాగుతోంది. అడవుల్లో ఇంకా కొందరు మావోయిస్టులు దాక్కొని ఉండొచ్చనే అనుమానంతో బలగాలు అణువణువూ గాలిస్తున్నాయి. ఘటనా స్థలం నుంచి భద్రతా బలగాలు భారీ ఎత్తున సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. దీంతో పాటు పేలుడు పదార్థాలు, జిలెటిన్ స్టిక్స్, మావోయిస్టులకు సంబంధించిన వస్తువులు ఉన్నాయి.


అప్రమత్తమైన పోలీసులు..

ఈ ఘటన నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించినట్లు సమాచారం. నక్సల్స్ ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో.. సరిహద్దు గ్రామాల్లో పోలీసులు గోప్యంగా తనిఖీలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.


మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా...

ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. కొంతకాలంగా బస్తర్ రీజియన్‌లో వరుస ఎన్‌కౌంటర్లు జరగడం మావోయిస్టు కేడర్‌కు పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. అటవీ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పోలీస్ క్యాంపుల ఏర్పాటు వల్ల మావోయిస్టుల కదలికలు పరిమితమవుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

అభివృద్ధిని అడ్డుకుంటున్న బీఆర్ఎస్‌ను బొందపెట్టాలి.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

మా ప్రభుత్వంపై ఫేక్ ప్రచారం చేస్తున్నారు.. జగన్ అండ్ కోపై సీఎం ఫైర్

For More TG News And Telugu News

Updated Date - Jan 18 , 2026 | 07:40 PM