Share News

Premalatha: ప్రేమలత సంచలన కామెంట్స్.. దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ

ABN , Publish Date - Sep 11 , 2025 | 11:11 AM

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బిహార్‌ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ జరుగుతోందని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత ఆరోపించారు. తంజావూరులో ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ... రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని, ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ పార్టీల మధ్య పొత్తు ఖరారవుతుందని పేర్కొన్నారు.

Premalatha: ప్రేమలత సంచలన కామెంట్స్.. దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ

- డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత

చెన్నై: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బిహార్‌ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ జరుగుతోందని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత(Premalatha) ఆరోపించారు. తంజావూరులో ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ... రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని, ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ పార్టీల మధ్య పొత్తు ఖరారవుతుందని పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పొత్తుల వ్యవహారంపై జనవరిలో నిర్వహించే మహానాడులో నిర్ణయం తీసుకుంటామన్నారు.


nani1.2.jpg

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని ప్రజలు కోరుకుంటున్నారని, అయితే ప్రజల కోరిక నెరవేర్చాలిన బాధ్యత ఎన్నికల కమిషన్‌ దేనన్నారు. బిహార్‌ రాష్ట్రంలోనే ఓట్ల చోరీ జరగలేదని, తమిళనాడు సహా అన్ని రాష్ట్రాల్లో ఇది కొనసాగుతోందని, దానిని అడ్డుకోవాల్సిన బాధ్యత ఈసీపై ఉందని ఈ వ్యవహారంలో న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకోవాలని ప్రేమలత విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మరింత పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

పిడుగుపాట్లకు 9 మంది బలి

Read Latest Telangana News and National News

Updated Date - Sep 11 , 2025 | 11:11 AM