Lightning Strikes Deaths: పిడుగుపాట్లకు 9 మంది బలి
ABN , Publish Date - Sep 11 , 2025 | 06:21 AM
జోగుళాంబ గద్వాల, నిర్మల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పిడుగుపాట్లకు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గద్వాల జిల్లా అయిజ మండలం భూమ్‌పూర్‌లో పత్తిచేలో పనికి వెళ్లిన ముగ్గురు కూ లీలు...
పొలం పనుల్లో ఉన్న రైతులు, కూలీలపై పిడుగుల మృత్యుపాశం
గద్వాలలో ఒకేచోట ముగ్గురి మృతి
నిర్మల్‌లో రైతు దంపతులతో పాటువారి బంధువు మృత్యువాత.. వ్యక్తి ఫోన్లోమాట్లాడుతుండగా దగ్గర్లో పిడుగు.. మృతి
అయిజ/పెంబి/మధిర రూరల్/సత్తుపల్లి/కామేపల్లి/గుండాల/కొత్తగూడెం, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యో తి): జోగుళాంబ గద్వాల, నిర్మల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పిడుగుపాట్లకు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గద్వాల జిల్లా అయిజ మండలం భూమ్‌పూర్‌లో పత్తిచేలో పనికి వెళ్లిన ముగ్గురు కూ లీలు మృత్యువాత పడ్డారు. బుధవారం సాయంత్రం 4గంటల సమయంలో వర్షం రావడంతో వారు చేలో నుంచి గట్టుపైఉన్న తాటిచెట్టు దగ్గరకు వెళ్లారు. ఆ చెట్టుపై పిడుగుపడడంతో బోయ సర్వేసు(24), ఈడిగ పార్వతి(34), సౌభాగ్య(36) అక్కడికక్కడే మృతిచెందారు. జ్యోతి, రాజు అనే ఇద్దరికి తీవ్ర గాయాలు కావటంతో ఆస్పత్రికి తరలించారు.
ఊ నిర్మల్ జిల్లా పెంబి మండలం గుమ్మెన ఎంగ్లాపూర్ గ్రామానికి చెందిన ఆలకుంట ఎల్లయ్య (37), ఆయన భార్య లక్ష్మి (32), మేనమామ బండారి వెంకన్న (50) పత్తి చేనులో కలుపు తీయడానికి వెళ్లారు. సాయంత్రం ఉరుములతో వర్షం మొదలవడంతో మంచె కిందికి వెళ్లారు. మంచెపై పిడుగు పడటంతో ముగ్గురూ అక్కడికక్కడే చనిపోయారు.
ఫోన్ మాట్లాడి కట్ చేయగానే..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేర్వేరుచోట్ల పిడుగులు ఇద్దరు రైతులతో పాటు ఓ యువకుడిని బలి తీసుకున్నాయి. మధిర సమీపంలోని మడుపల్లికి చెందిన రైతు గడిపూడి వీరభద్రరావు (53) పొలంలో కలుపు తీయించేందుకు బుధవారం ఉదయం తన భార్య పద్మతో పాటు పది మంది కూలీలతో వెళ్లాడు. సాయంత్రం వర్షం మొదలై పిడుగుపడటంతో వీరభద్రరావు అక్కడికక్కడే మృతిచెందాడు. వీరభద్రరావు తన తమ్ముడితో ఫోన్‌లో మాట్లాడి కట్ చేసిన తర్వా త రెండు నిమిషాల వ్యవధిలో పిడుగుపడింది. అత ని జేబులో ఉన్న ఫోన్ పగిలిపోయింది.
ఫోన్ మాట్లాడుతుండగా..
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన మహేష్ (32) కూడా పిడుగుపాటుకు బలయ్యాడు. అతను పశువులను మేతకు తోలుకుని గ్రామ శివారుకు వెళ్లగా సా యంత్రం 4 గంటల సమయంలో భారీ వర్షం మొదలైంది. ఆ సమయంలో ఫోన్ మాట్లాడుతున్న మహే ష్‌కు అతి సమీపంలో పిడుగుపడటంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యు లు తెలిపారు.
ఊ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం చీమలగూడెం గ్రామానికి చెందిన పాయం నర్సయ్య (50) రోజులాగానే బుధవారం తన మొక్కజొన్న చేనులో కోతులు పడకుండా కాపలాకు వెళ్లాడు. సాయంత్రం ఉరుములు, మెరుపులతో వర్షం మొదలవడంతో చేనులోని మంచె వద్దకు వెళ్లాడు. మంచెను ఆనుకొని ఉన్న చెట్టుపై పిడుగు పడటం తో నర్సయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. రాత్రి 8 గంటల వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ స భ్యులు వెతగ్గా.. నర్సయ్య విగతజీవిగా కనిపించాడు.
ఊ ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురంలో గుగులోత్ బావ్‌సింగ్ అనే రైతు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం స్టేషన్ బేతంపూడిలో ఈసం రాజమ్మ, కొడెం పాపమ్మ, గొగ్గెల శిరీష అనే వ్యవసాయ కూలీలు పిడుగుపాట్లకు గాయపడ్డారు. వీరంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇవి కూడా చదవండి
భారత్‌లో తొలి టెస్లా కారు డెలివరీ.. కస్టమర్ ఎవరంటే..
34 వాహనాల్లో మానవబాంబులు.. బెదిరింపు మెయిల్స్‌తో హైఅలర్ట్
For More National News and Telugu News