Share News

Premalatha: అన్ని పార్టీలతో సఖ్యతగానే ఉన్నాం.. ఏ కూటమి నుంచీ ఆహ్వానం రాలేదు

ABN , Publish Date - Sep 27 , 2025 | 01:52 PM

అన్ని పార్టీలతోనూ డీఎండీకే స్నేహపూర్వకంగానే మెలగుతోందని, అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పొత్తుపై చర్చించేందుకు ఇప్పటి వరకు ఏ కూటమి నుంచి కూడా తమకు ఆహ్వానం అందలేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమలత అన్నారు.

Premalatha: అన్ని పార్టీలతో సఖ్యతగానే ఉన్నాం.. ఏ కూటమి నుంచీ ఆహ్వానం రాలేదు

- డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత

చెన్నై: అన్ని పార్టీలతోనూ డీఎండీకే స్నేహపూర్వకంగానే మెలగుతోందని, అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పొత్తుపై చర్చించేందుకు ఇప్పటి వరకు ఏ కూటమి నుంచి కూడా తమకు ఆహ్వానం అందలేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమలత(Premalatha) అన్నారు. శనివారం కోయంబేడులోని పార్టీ కార్యాలయం వద్ద తన ప్రచార వాహనాన్ని ఆమె పరిశీలించారు.


ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ జనవరి 9న కడలూరులో పార్టీ మహానాడు జరుపనున్నామని, ఆ సభలోనే ఏ కూటమితో పొత్తుపెట్టుకుంటామనే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తానన్నారు. నటుడు విజయ్‌ రాకతో రాష్ట్ర రాజకీయాల్లో తప్పకుండా మార్పు వస్తుందన్నారు. ఇటీవల సీఎం స్టాలిన్‌(CM Stalin) అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత తాను ఆయన నివాసానికి వెళ్ళి పరామర్శించానని,


nani6.2.jpg

మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుటుంబ సభ్యులు, తమ కుటుంబ సభ్యుల మధ్య ఎన్నో యేళ్లుగా సన్నిహిత సంబంధాలున్నాయని, కెప్టెన్‌తో తన వివాహాన్ని జరిపింది కరుణానిధే అనే విషయం అందరికీ తెలిసిందేనని ఆమె చెప్పారు. విజయ్‌ సినిమాలలో రాణించినట్లు రాజకీయాల్లో రాణించడం సులువైన విషయం కాదని చెప్పారు.


zzzz.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి ధరల్లో స్వల్ప పెరుగుదల! నేటి రేట్స్ ఇవే..

ట్రిపుల్‌ ఆర్‌ బాధితుల ఆరోపణలు నిజమే

Read Latest Telangana News and National News

Updated Date - Sep 27 , 2025 | 01:52 PM