Share News

తమిళనాట సంకీర్ణానికి తావు లేదు: స్టాలిన్‌

ABN , Publish Date - Feb 12 , 2026 | 06:36 AM

తమిళనాట సంకీర్ణ ప్రభుత్వానికి తావులేదని డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌ స్పష్టం చేశారు. చెన్నైలో బుధవారం ఓ ఆంగ్ల పత్రిక నిర్వహించిన కార్యక్రమంలో స్టాలిన్‌ మాట్లాడుతూ...

తమిళనాట సంకీర్ణానికి తావు లేదు: స్టాలిన్‌

చెన్నై, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): తమిళనాట సంకీర్ణ ప్రభుత్వానికి తావులేదని డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌ స్పష్టం చేశారు. చెన్నైలో బుధవారం ఓ ఆంగ్ల పత్రిక నిర్వహించిన కార్యక్రమంలో స్టాలిన్‌ మాట్లాడుతూ.. ప్రసారమాధ్యమాల్లో చెబుతున్నట్టు కాంగ్రె్‌స-డీఎంకేల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, రెండు పార్టీలు కలిసే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తాయని తెలిపారు. రాష్ట్రంలో డీఎంకే కూటమి మళ్లీ ఘనవిజయం సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయన్నారు. డీఎంకేకు-ద్వితీయ పార్టీకి మధ్య వ్యత్యాసం 12 శాతం ఉన్నట్టు కొన్ని ముఖ్యమైన సర్వేలు అంచనా వేశాయని, ఈ వ్యత్యాసం 3 శాతం ఉంటేనే క్లీన్‌ స్వీప్‌ అని, అలాంటిది 12 శాతం వ్యత్యాసం అంటే అది థంపింగ్‌ విక్టరీ అవుతుందని విశ్లేషించారు. ఐదేళ్ల ద్రావిడ తరహా డీఎంకే పాలనలో రాష్ట్రం 11.19 శాతం ఆర్థిక ప్రగతిని సాధించిందన్నారు. డీఎంకేతోనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని ప్రజలంతా భావిస్తున్నారని స్టాలిన్‌ చెప్పారు. మరోవైపు, తమిళనాడులో అన్నాడీఎంకే సొంత మెజారిటీతోనే అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి అన్నారు. డీఎంకే కూటమిలో గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయని చెప్పారు.

ఇవి కూడా చదవండి...

కేసీఆర్‌పై చర్యలు తీసుకోరా.. సీఎం రేవంత్‌‌కు బండి సంజయ్ సూటిప్రశ్న

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు.. భూసేకరణ షురూ..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 12 , 2026 | 06:36 AM