Share News

114 రఫేల్ యుద్ధ విమానాలు, 6 పీ8ఐ విమానాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

ABN , Publish Date - Feb 12 , 2026 | 03:43 PM

ఫ్రాన్స్ నుంచి 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన కీలకమైన డిఫెన్స్ డీల్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రూ.3.25 లక్షల కోట్ల విలువైన డీల్ ఇది.

114 రఫేల్ యుద్ధ విమానాలు, 6 పీ8ఐ విమానాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
Rafale Jets

న్యూఢిల్లీ: ఫ్రాన్స్ నుంచి 114 రఫేల్ యుద్ధ విమానాల (Rafale Jets) కొనుగోలుకు సంబంధించిన కీలకమైన డిఫెన్స్ డీల్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రూ.3.25 లక్షల కోట్ల విలువైన డీల్ ఇది. ఈ డీల్‌కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ కౌన్సిల్ ఆమోదం తెలిపినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భారత నావికా దళం కోసం 6 పీ8i (P8i) విమానాలను కొనుగోలు చేసే డీల్‌‌ను కూడా ఆమోదించినట్టు తెలిపాయి. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు డీల్‌తో భారత వాయుసేన పోరాట సామర్థ్యం మరింత పెరుగుతుంది.


ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఈనెల ద్వితీయార్థంలో భారత్ పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగానే డిఫెన్స్ డీల్‌పై సంతకాలు జరిగే అవకాశాలున్నాయి. డీల్ ప్రకారం 18 రఫేల్ జట్లను 'ఫ్లై-అవే కండిషన్'లో నేరుగా తీసుకువస్తారు. తక్కిన 96 విమానాలు ఇండియాలో అసెంబుల్ చేస్తారు. 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంలో భాగంగా స్థానికంగా తయారీ, అసెంబెల్ కోసం రఫేల్ మాతృ సంస్థ డసో ఏవియేషన్, భారత్‌లోని ప్రైవేటు రంగ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటారు. భారత వాయుసేన వద్ద ప్రస్తుతం 36 రఫేల్ యుద్ధవిమానాలు ఉన్నాయి.


ఇవి కూడా చదవండి..

స్పీకర్ ఛాంబర్‌లో కాంగ్రెస్ ఎంపీల వీరంగం.. వీడియో షేర్ చేసిన కిరణ్ రిజిజు

రాహుల్‌పై సభా హక్కుల తీర్మానానికి కేంద్రం విముఖత..

Updated Date - Feb 12 , 2026 | 05:34 PM