Share News

యూట్యూబ్ డౌన్.. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది యూజర్ల ఫిర్యాదు

ABN , Publish Date - Feb 18 , 2026 | 09:30 AM

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ యూట్యూబ్ డౌన్ కావడంతో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది యూజర్లు ఫిర్యాదు చేశారు. దీనిపై యూట్యూబ్ యాజమాన్యం స్పందించింది. వివరాల్లోకి వెళితే..

యూట్యూబ్ డౌన్.. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది యూజర్ల ఫిర్యాదు
YouTube Down

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్ యూట్యూబ్(YouTube) సేవల్లో అంతరాయం నెలకొంది. మొబైల్, కంప్యూటర్లలో యూట్యూబ్ ఓపెన్ చేస్తే ‘something went wrong’ అని చూపించడంతో యూజర్లు షాక్ తిన్నారు. చాలా మందికి యూట్యూబ్ వీడియోలు డౌన్‌లోడ్(Download) కాలేదు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది యూజర్లు ఫిర్యాదులు(Users complain) చేశారు.


ఒక్క అమెరికా(America)లోనే 3 లక్షల మందికి పైగా యూజర్లు డౌన్‌డిటెక్టర్‌కు ఫిర్యాదులు చేయడం గమనార్హం. దీనిపై స్పందించిన యూట్యూబ్ యాజమాన్యం.. స్ట్రీమింగ్(streaming) లో కొన్ని సమస్యలు ఎదురవుతున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని తెలిపింది. సమస్య పరిష్కరించడం కోసం తమ టెక్ టీమ్‌లు పనిచేస్తున్నాయని పేర్కొంది. సెర్చ్ రిజల్ట్, వీడియోలు ప్లే కావడం లేదని భారత్ నుంచి 18 వేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయని యూట్యూబ్ యాజమాన్యం తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి

9 నెలల్లో ఫ్యూచర్‌ సిటీ మాస్టర్‌ ప్లాన్‌

బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటే!

Updated Date - Feb 18 , 2026 | 09:51 AM