బంగ్లాదేశ్ ప్రధానిగా తారిఖ్ రెహమాన్ ప్రమాణస్వీకారం
ABN , Publish Date - Feb 17 , 2026 | 05:36 PM
బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా బంగ్లేదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్మన్ తారిఖ్ రెహమాన్ మంగళవారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. నేషనల్ పార్లమెంట్ బిల్డింగ్ సౌత్ ప్లాజాలో ఈ కార్యక్రమం జరిగింది.
ఢాకా: బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా బంగ్లేదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) చైర్మన్ తారిఖ్ రెహమాన్ (Tarique Rahman) మంగళవారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. నేషనల్ పార్లమెంట్ బిల్డింగ్ సౌత్ ప్లాజాలో ఈ కార్యక్రమం జరిగింది. తారిఖ్ రెహమాన్‌తో అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ ప్రమాణస్వీకారం చేయించారు.

అధికారిక సమాచారం ప్రకారం తారిఖ్ రెహమాన్ తన మంత్రివర్గంలో ఇంతవరకూ ఎలాంటి పదవులు చేపట్టని 17 మంది మంత్రులు, 24 మంది సహాయ మంత్రులను తీసుకున్నారు. బీఎన్‌పీ గతంలో అధికారంలో ఉన్నప్పటికీ కేంద్ర క్యాబినెట్‌లో రెహమాన్ చేరడం కూడా ఇదే ప్రథమం. ఇటీవల జరిగిన 13వ నేషనల్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఎన్‌పీ సారథ్యంలోని కూటమి అధికారం కైవసం చేసుకుంది. 20 ఏళ్ల తర్వాత బీఎన్‌పీ అధికారంలోకి రావడం ఇదే ప్రథమం. చివరిసారిగా 2001 నుంచి 2006 వరకూ బీఎన్‌పీ అధికారంలో ఉంది.
బీఎన్‌పీ నాయకురాలు ఖాలిదా జియా కుమారుడైన రెహమాన్ 2008 బంగ్లా విడిచి వెళ్లారు. 17 ఏళ్లు ప్రవాసంలోనే ఉన్నారు. ఖాలిదా జియా మరణంతో గత డిసెంబర్‌లో ఆయన స్వదేశానికి వచ్చారు. పార్టీ పగ్గాలు స్వీకరించి విజయవంతంగా అధికారంలోకి పార్టీని తీసుకువచ్చారు. 299 పార్లమెంటు స్థానాలకు గాను 209 స్థానాలను బీఎన్‌పీ కూటమి గెలుచుకుంది.
ఇవి కూడా చదవండి..
మోదీ ఇజ్రాయెల్ పర్యటన.. వెల్లడించిన నెతన్యాహు
మీ వీసాలను లాగేసుకుంటాం.. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి వార్నింగ్