Home » Prime Minister
శ్రీరాముడి జన్మస్థలంపై నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామ భగవానుడు నేపాల్‌లోనే జన్మించాడని పునరుద్ఘాటించారు.
హిందూ పురాణాల్లో పేర్కొనే శివుడు, విశ్వామిత్రుడు కూడా నేపాల్ నుంచి వచ్చిన వారేనని కేపీ శర్మ ఓలి చెప్పారు. ఇది తానేదో చెబుతున్నది కాదని, విశ్వామిత్రుడు చతరాలో పుట్టినట్టు వాల్మీకి రామాయణం చెబుతోందని అన్నారు.
కేంద్ర సామాజిక భద్రత పథకాలతో దేశంలో 95 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారని ప్రధాని మోదీ వెల్లడించారు. జనాభాలో 64 శాతం మందికి ఏదో ఒక రూపంలో సంక్షేమం...
వరంగల్‌కు చెందిన కొత్త జంటకు ప్రధాని నరేంద్ర మోదీ మర్చిపోలేని గిఫ్ట్ పంపించారు. దీంతో వధూవరుల కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సామాన్య ప్రజల పట్ల ప్రధాని మోదీ చూపిన ప్రత్యేక శ్రద్ధపై జిల్లా ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలుగా ఇండియా-కెనడా గౌరవించుకుంటూ, పరస్పర ప్రయోజనాలు పొందే దిశగా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాయని మోదీ చెప్పారు. జీ7 సదస్సులో మార్క్ కార్నీతో సమావేశానికి ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.
ఆయుధ దాడులతో గాజా తీవ్ర కరవుకాటకాల్లో చిక్కుకుని మానవతా సంక్షోభాన్ని చవిచూస్తోందని, అది చాలదన్నట్టుగా నీటిని ఆయుధంగా మలుచుకునే పరిస్థితి ఇప్పుడు కళ్లముందు కనిపిస్తోందని షెహబాజ్ వ్యాఖ్యానించారు.
PM Modi PoK Statement: అంతర్జాతీయ సమాజానికి, పాకిస్థాన్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టమైన సందేశం ఇచ్చారు. భారత్ ఎట్టి పరిస్థితుల్లో సరిహద్దు వద్ద దాడులను సహించదని.. పాక్ ఆక్రమిత కశ్మీర్ అప్పగింతపై తప్ప మరో అంశంపై పొరుగు దేశంతో చర్చించబోమని తేల్చిచెప్పారు.
ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడడానికి దౌత్యమార్గాలను అన్వేషించాలని తన సోదరుడు, పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌కు మాజీ ప్రధాని నవాజ్ షరీప్ సూచించినట్టు 'ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్' ఒక కథనం లో పేర్కొంది.
షహబాజ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను కూడా భారత్‌లో బ్లాక్ చేశారు. షహబాజ్ కంటెండ్‌ను రిస్ర్కిక్ట్ చేయాలంటూ లీగల్ రిక్వెస్ట్ రావడంతో ఆయన భారత్ అకౌంట్‌ను రద్దు చేశామని ఆయన ఇన్‌స్ట్రా అకౌంట్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించిన వారికి సందేశం కనిపిస్తోంది.
లాహోర్‌లో ఆదివారం సాయంత్రం సోదర ద్వయం- నవాజ్ షరీఫ్, షెహబాజ్ షరీఫ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇండియా చర్యలకు ప్రతిగా తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలను నవాజ్‌కు షెహబాజ్ వివరించారు.