Pakistan PM: ఏడు భారత్ జెట్లను స్క్రాప్‌గా మార్చాం.. యూఎన్‌జీఏలో పాక్ పీఎం
ABN , Publish Date - Sep 26 , 2025 | 09:49 PM
తమ దేశ పైలట్లు 'ఫాల్కన్స్' వంటి వారని, ఎవరికీ అందనంత ఎత్తుకు విమానాలను తీసుకెళ్లి భారత విమానాలను ధ్వంసం చేశారని షరీఫ్ చెప్పారు. ఈ ఏడాది మేలో ఈస్ట్రన్ ఫ్రంట్ నుంచి ఎలాంటి కారణం లేకుండా తమ దేశంపై దాడులు జరిగాయని, ఆత్మరక్షణ కోసం తాము దీటుగా స్పందించామని చెప్పారు.
న్యూయార్క్: కిందపడినా మాదే పైచేయి అని చెప్పుకోవడంలో పాక్ ఏమాత్రం సిగ్గుపడదు. 'ఆపరేషన్ సిందూర్' వేళ భారత్ ధాటికి తట్టుకోలేక కాళ్ల బేరానికి వచ్చిన దాయాది దేశం మరోసారి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. ఈ ఏడాది భారత్‌తో మిలటరీ ఘర్షణల్లో పాక్ ఫైటర్ జెట్‌లు గర్జించి ఏడు భారత్ జెట్లను స్క్రాప్‌గా మార్చేసినట్టు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) శుక్రవారం నాడు అన్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA)లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
తమ దేశ పైలట్లు 'ఫాల్కన్స్' వంటి వారని, ఎవరికీ అందనంత ఎత్తుకు విమానాలను తీసుకెళ్లి భారత విమానాలను ధ్వంసం చేశారని షరీఫ్ చెప్పారు. ఈ ఏడాది మేలో ఈస్ట్రన్ ఫ్రంట్ నుంచి ఎలాంటి కారణం లేకుండా తమ దేశంపై దాడులు జరిగాయని, ఆత్మరక్షణ కోసం తాము దీటుగా స్పందించామని, గట్టి గుణపాఠం చెప్పి వెనక్కి పంపామని తెలిపారు.
భారత వాయుసేనకు చెందిన 5 విమానాలను కూల్చేసినట్టు పాక్ ఇటీవల పలుమార్లు ప్రకటించింది. అయితే పాక్ ప్రకటనలను భారత్ నిరాధారమైనవిగా కొట్టేసింది. పాక్ చెప్పిన దానికి ఆధారాలుంటే చూపించాలని సవాలు చేసింది. ఆపరేషన్ సిందూర్ అనంతరం పాక్‌స్థాన్ సైనికాధికారుల విజ్ఞప్తి మేరకే కాల్పుల విరమణకు అంగీకరించామని భారత్ పదేపదే స్పష్టం చేస్తోంది. ఇందులో తృతీయ దేశం జోక్యం లేదని కూడా తెగేసి చెప్పింది.
ఇవి కూడా చదవండి..
అలాంటివి మాట్లాడుకోలేదు.. నాటో నిర్లక్ష్యాన్ని తప్పుపట్టిన భారత్..
భారత్‌పై సుంకాలు.. రష్యాపై తీవ్ర ప్రభావం: నాటో చీఫ్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి