ట్రంప్‌నకు ఝలక్... భారత్ టూర్‌కు కెనడా ప్రధాని
ABN , Publish Date - Jan 26 , 2026 | 07:34 PM
కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న పార్లమెంటులో బడ్జెట్ సమర్పణ అనంతరం కార్నే పర్యటన ఉండవచ్చని భారత హైకమిషనర్ దినేష్ పట్నాయక్ తెలిపారు. మార్చి మొదటి వారంలో కార్నే పర్యటన ఉండే అవకాశాలున్నాయని చెప్పారు.
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులను అంతే దీటుగా తిప్పికొడుతూ, తమ దేశ సార్వభౌమాధికారం విషయంలో రాజీ లేదని చెబుతున్న కెనడా (Candada) ప్రధానమంత్రి మార్క్ కార్నే (Mark Carney) తాజాగా భారత్‌లో పర్యటనకు సన్నద్ధమవుతున్నారు. కెనడా, భారత్ మధ్య ఉన్న సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా పలు వాణిజ్య ఒప్పందాలను చేసుకునేందుకు కార్నే ఈ పర్యటన చేపట్టనున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న పార్లమెంటులో బడ్జెట్ సమర్పణ అనంతరం కార్నే పర్యటన ఉండవచ్చని భారత హైకమిషనర్ దినేష్ పట్నాయక్ తెలిపారు. మార్చి మొదటి వారంలో కార్నే పర్యటన ఉండే అవకాశాలున్నాయని చెప్పారు. కార్నే తన పర్యటనలో యురేనియం, ఇంధనం, ఖనిజాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించి పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు.
ట్రంప్ విధిస్తున్న అధిక సుంకాలతో భారత్ సైతం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'గా చెబుతున్న భారత్-ఐరోపా సమాఖ్య మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం త్వరలో ఖరారయ్యే అవకాశాలున్నాయి. దీనికి బోనస్‌గా కెనడా సైతం వాణిజ్య ఒప్పందానికి సిద్ధమవుతుండటం భారత్‌కు మరింత కలిసొచ్చే పరిణామంగా అంచనా వేస్తున్నారు.
కెనడాకు ట్రంప్ బెదిరింపులు
వేదిక ఏదైనప్పటికీ డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కాలంలో కెనడాపై తరచు నిప్పులు చెరుగుతున్నారు. తాము లేకుంటే కెనడానే లేదని బెదిరిస్తున్నారు. గాజా పీస్ బోర్డుకు కెనడా మద్దతు చెప్పకపోవడాన్ని తప్పుపడుతూ, తమకు మద్దతు ఇవ్వని దేశాలను గుర్తుంచుకుంటామని హెచ్చరించారు. దీనికి కార్నే సైతం దీటుగానే సమాధామిచ్చారు. తాము ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడటం లేదని, అమెరికాకు 51వ రాష్ట్రంగా తాము ఉండేది లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో కార్నే భారత్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకోనుంది.
ఇవి కూడా చదవండి..
కార్లపై 40 శాతానికి సుంకం తగ్గింపు.. ఈయూతో భారత్ ట్రేడ్‌డీల్
భారత్‌తో ప్రపంచానికి భద్రత, సుస్థిరత.. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలి వ్యాఖ్య
Read Latest National News