Share News

కార్లపై 40 శాతానికి సుంకం తగ్గింపు.. ఈయూతో భారత్ ట్రేడ్‌డీల్

ABN , Publish Date - Jan 26 , 2026 | 05:17 PM

ఐరోపా యూనియన్ నుంచి దిగుమతి అవుతున్న లగ్జరీ కార్లపై సుంకాన్ని 40 శాతానికి తగ్గించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్టు తెలుస్తోంది.

కార్లపై 40 శాతానికి సుంకం తగ్గింపు.. ఈయూతో భారత్ ట్రేడ్‌డీల్
India-EU Trade Deal

న్యూఢిల్లీ: 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'గా చెబుతున్న భారత్-ఐరోపా సమాఖ్య (India-European Union) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం త్వరలో ఖరారయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతుండగా, ఐరోపా యూనియన్ నుంచి దిగుమతి అవుతున్న లగ్జరీ కార్లపై సుంకాన్ని 40 శాతానికి తగ్గించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టారిఫ్ 110 శాతంగా ఉంది. 27 దేశాల ఈయూ కూటమి నుంచి దిగుమతి అయ్యే 15 వేల యూరోల కంటే ఎక్కువ ధర ఉన్న కార్లకు తగ్గింపు టారిఫ్ వెసులుబాటు ఉంటుంది. తక్షణం ఈ సుంకాల తగ్గింపునకు కేంద్రం అంగీకరించినట్టు సమాచారం.


భారత్ తీసుకున్న నిర్ణయంతో వోక్స్‌వ్యాగన్, మెర్సిడెజ్ బెంచ్, బీఎండబ్ల్యూ వంటి ఐరోపా సంస్థలకు భారత్ మార్కెట్‌లో సులభతర వాణిజ్యం వీలవుతుంది. అయితే ఎంతో కాన్ఫిడెన్షియల్‌గా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్యలు జరుగుతుండటం, చివరి నిమిషంలో మార్పులకు అవకాశం ఉండటంతో సుంకాల తగ్గింపు అంశంపై ఇప్పుడే తామెలాంటి వ్యాఖ్యలు చేయలేమని భారత వాణిజ్య శాఖ, యూరోపియన్ కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి.


రేపు ప్రకటనకు అవకాశం

కాగా, భారత్-ఐరోపా సమాఖ్య మధ్య స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందంలో సంప్రదింపులు చివరిదశలో ఉన్నందున మంగళవారం దీనిపై ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్ లేయెన్ సైతం ఇటీవల దావోస్ వేదికగా భారత్‌తో ట్రేడ్ డీల్‌ను కీలకంగా ప్రస్తావించారు. 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'గా ఈ ఒప్పందాన్ని పోలుస్తూ, ఇందువల్ల కోట్లాది మంది ప్రజలు వస్తువులు, సేవలు దిగుమతి చేసుకునే సౌలభ్యం ఉంటుంది, ఇది ప్రపంచ జీడీపీలో 25 శాతానికి సమానమని చెప్పారు. ప్రస్తుతం ఉర్సాలా భారత 77వ గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి..

శశిథరూర్‌తో సీపీఎం మంతనాలు.. ఆయన ఏమన్నారంటే..

భారత్‌తో ప్రపంచానికి భద్రత, సుస్థిరత.. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలి వ్యాఖ్య

Read Latest National News

Updated Date - Jan 26 , 2026 | 05:33 PM