శశిథరూర్‌తో సీపీఎం మంతనాలు.. ఆయన ఏమన్నారంటే..
ABN , Publish Date - Jan 26 , 2026 | 03:01 PM
శశిథరూర్ ప్రస్తుతం లిటరరీ ఫెస్టివల్ కోసం దుబాయ్‌లో ఉన్నారు. సీపీఎం నేతలను కలుకున్నట్టు వస్తున్న వార్తలపై మీడియా ఈ సందర్భంగా ఆయనను ప్రశ్నించగా ఆయన సూటి సమాధానం దాటవేశారు.
తిరువనంతపురం: కాంగ్రెస్ పార్టీ తిరువనంతపురం ఎంపీ శశిథూరూర్ (Shashi Tharoor) రాజకీయ భవిష్యత్తుపై కొద్దికాలంగా చర్చ జరుగుతోంది. బీజేపీకి దగ్గరవుతున్నారంటూ సొంత పార్టీ వర్గాల నుంచే ఆయన విమర్శలను ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం తనను దూరంగా పెడుతోందనే అసంతృప్తితో శశిథరూర్ ఉన్నారనే ఉహాగానాలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కేరళ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఈ ఊహాగానాలు మరింత ఊపందుకుంటున్నాయి. తాజాగా శశిథరూర్‌తో అధికార వామపక్ష కూటమి చర్చలు జరిపిందనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై వ్యాఖ్యానించేందుకు శశిథరూర్ నిరాకరించారు.
శశిథరూర్ ప్రస్తుతం లిటరరీ ఫెస్టివల్ కోసం దుబాయ్‌లో ఉన్నారు. సీపీఎం నేతలను కలుకున్నట్టు వస్తున్న వార్తలపై మీడియా ఈ సందర్భంగా ఆయనను ప్రశ్నించగా ఆయన సూటి సమాధానం దాటవేశారు. దూబాయ్‌కి విమానంలో వెళ్తుండగా తాను ఈ వార్తలను చూశానని, ఇలాంటి అంశాలపై విదేశాల్లో ఉన్నప్పుడు మాట్లాడటం సరికాదని ఆయన జవాబిచ్చారు.
కొచ్చిలో ఇటీవల జరిగిన పార్టీ కార్యక్రమంలో రాహుల్ గాంధీ తనను ఏమాత్రం గుర్తించలేదని, పార్టీ నేతలు కూడా తనను పట్టించుకోవడం లేదని శశిథరూర్ కొద్దికాలంగా అసంతృప్తితో ఉన్నారు. 18 ఏళ్లుగా పార్టీకి విధేయుడుగా పనిచేస్తున్నానని, పార్లమెంటులో తాను ఏరోజూ పార్టీ విధానాలతో విభేదించలేదని చెబుతున్నారు. 'ఆపరేషన్ సిందూర్' విషయంలోనే పార్టీతో తనకు అభిప్రాయ భేదాలు ఉన్నాయని, అందుకు తాను కట్టుబడి ఉన్నానని ఇటీవల తెలిపారు.
వస్తానంటే స్వాగతిస్తాం: ఎల్డీఎఫ్
కాగా, శశిథరూర్‌తో తమ పార్టీ చర్చలు జరిపినట్టు వస్తున్న ఊహాగానాలను ఎల్డీఎఫ్ కన్వీనర్ టీపీ రామకృష్ణన్ తోసిపుచ్చారు. అయితే లెఫ్ట్ ఫ్రంట్ విధానాలకు కట్టుబడే వ్యక్తులు, గ్రూపులు, పార్టీలను తమతో కలుపుకుని వెళ్లేందుకు తాము సిద్ధమేనని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
భారత్‌తో ప్రపంచానికి భద్రత, సుస్థిరత.. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలి వ్యాఖ్య
భారత సైనిక శక్తిని చాటిన గణతంత్ర దినోత్సవ పరేడ్.. హైలైల్స్ ఇవే!
Read Latest National News