Share News

రిపబ్లిక్ డే వేడుకల్లో గుండెపోటుతో ఎస్ఐ కన్నుమూత

ABN , Publish Date - Jan 26 , 2026 | 03:38 PM

ధరాశివ్ జిల్లా ఉమర్గా టౌన్‌లో గణంత్ర వేడుకలు జరుగుతుండగా మోహన్ జాదవ్ గుండెపోటుతో కన్నుమూసినట్టు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపింది.

రిపబ్లిక్ డే వేడుకల్లో గుండెపోటుతో ఎస్ఐ కన్నుమూత
Mohan Jadhav

ఉస్మానాబాద్: మహారాష్ట్రలోని ధరాశివ్ జిల్లాలో రిపబ్లిక్ వేడుకల సందర్భంగా సోమవారంనాడు విషాద ఘటన చోటుచేసుకుంది. జెండా ఆవిష్కరణ జరుగుతుండగా విధి నిర్వహణలో ఉన్న పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ మోహన్ జాదవ్ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.


ధరాశివ్ జిల్లా ఉమర్గా టౌన్‌లో గణతంత్ర వేడుకలు జరుగుతుండగా మోహన్ జాదవ్ గుండెపోటుతో కన్నుమూసినట్టు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపింది. జాతీయపతాకానికి అధికారులు, సిబ్బందితో కలిసి వందనం చేస్తుండగా అకస్మాత్తుగా ఆయన గుండెపోటుతో వెనక్కి పడిపోయారని, దీంతో తలకు తీవ్రగాయమైందని తెలిపింది. వెంటనే సిబ్బంది ఆయనను ఉమర్గాలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని పేర్కొంది. గుండెపోటుతో ఆయన మరణించినట్టు ప్రాథమిక సమాచారంలో వెల్లడైనప్పటికీ మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.


ఇవి కూడా చదవండి..

శశిథరూర్‌తో సీపీఎం మంతనాలు.. ఆయన ఏమన్నారంటే..

భారత్‌తో ప్రపంచానికి భద్రత, సుస్థిరత.. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలి వ్యాఖ్య

Read Latest National News

Updated Date - Jan 26 , 2026 | 03:42 PM