Share News

గ్రహాంతర జీవుల ఉనికి నిజమే కావొచ్చు.. అమెరికాలోని ఆ ప్రాంతం గురించి తెలియదు: ఒబామా

ABN , Publish Date - Feb 16 , 2026 | 07:13 AM

అమెరికాలోని నెవాడాలో ఉన్న 'ఏరియా 51' ప్రాంతం గురించి రకరకాల పుకార్లు వినిపిస్తుంటాయి. నెవాడా ఎడారిలో దాదాపు 200 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న 'ఏరియా 51' ప్రాంతంలో గ్రహాంతర జీవులను అమెరికా నిర్బంధించిందని చాలా మంది నమ్ముతుంటారు.

గ్రహాంతర జీవుల ఉనికి నిజమే కావొచ్చు.. అమెరికాలోని ఆ ప్రాంతం గురించి తెలియదు: ఒబామా
Barack Obama

అమెరికాలోని నెవాడాలో ఉన్న 'ఏరియా 51' ప్రాంతం గురించి రకరకాల పుకార్లు వినిపిస్తుంటాయి. నెవాడా ఎడారిలో దాదాపు 200 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న 'ఏరియా 51' ప్రాంతంలో గ్రహాంతర జీవులను అమెరికా నిర్బంధించిందని చాలా మంది నమ్ముతుంటారు. ఈ ప్రాంతం పూర్తిగా అమెరికా సైన్యం ఆధీనంలో ఉంటుంది. అక్కడ అమెరికా సైన్యం, శాస్త్రవేత్తలు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. సరికొత్త ఆయుధాలను పరీక్షిస్తుంటారు. ఆ ప్రాంతంలో ఏలియన్స్ కూడా ఉన్నాయని వార్తలు వస్తుంటాయి (Barack Obama aliens statement).


'ఏరియా 51' ప్రాంతంలో ఏలియన్స్ ఉన్నాయనే వార్తలపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందించారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఒబామా గ్రహాంతర వాసుల గురించి తన అభిప్రాయాన్ని చెప్పారు. 'ఏదో ఒక గ్రహంపై ఏలియన్స్ ఉంటాయని నేను బలంగా నమ్ముతున్నా. కానీ, ఏలియన్స్‌ను 'ఏరియా 51'లో బంధించారనే ఊహాగానాల్లో నిజం లేదు. దానిని నిరూపించే ఆధారాలేవీ లేవు. నేను అధికారంలో ఉన్నప్పుడు కూడా నాకు అలాంటి సమాచారం లేదు' అని ఒబామా స్పష్టం చేశారు (Obama Area 51 comment).


మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాలపై గ్రహాంతర వాసుల ఉనికి కనిపించిందని (US government aliens), వాటిని యూఎస్ ఎయిర్ ఫోర్స్ రీపర్ డ్రోన్లు పదేళ్ల క్రితం రికార్డ్ చేశాయని పలు నివేదికలు వెల్లడించాయి. అయితే గ్రహాంతర వాసుల ఉనికికి సంబంధించి అమెరికా దగ్గర రికార్డులు ఉన్నట్టు తాను నమ్మడం లేదని ఒబామా అన్నారు.


ఇవి కూడా చదవండి..

ఈ ఫొటోల్లోని ఏడు తేడాలను 16 సెకెన్లలో కనిపెట్టండి.. మీ కళ్ల పవర్ సరి చూసుకోండి ..

ఇషాన్ కిషన్ సూపర్ ఇన్నింగ్స్..

Updated Date - Feb 16 , 2026 | 10:10 AM