Share News

మీ వీసాలను లాగేసుకుంటాం.. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి వార్నింగ్

ABN , Publish Date - Feb 17 , 2026 | 05:21 PM

అమెరికాకు వచ్చే విదేశీయులు జాగ్రత్తగా ఉండాలని మంత్రి మార్కో రూబియో హెచ్చరించారు. అమెరికా వ్యతిరేక చర్యలకు దిగితే వారి వీసాలను వెనక్కు తీసుకుంటామని హెచ్చరించారు.

మీ వీసాలను లాగేసుకుంటాం.. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి వార్నింగ్
Marco Rubio

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో (Marco Rubio) విదేశీయులకు మరో వార్నింగ్ ఇచ్చారు. అమెరికా జాతీయ భద్రతకు వ్యతిరేకంగా వ్యవహరించే విదేశీయుల వీసాలను రద్దు చేసి వారిని వెనక్కు పంపించేస్తామని స్పష్టం చేశారు. అమెరికాకు వచ్చిన విదేశీ టూరిస్టులు, జర్నలిస్టులు, విద్యార్థులు అందరికీ ఈ హెచ్చరిక వర్తిస్తుందని అన్నారు.

అమెరికా జారీ చేసే వీసాకు పలు పరిమితులు ఉంటాయని మంత్రి మార్కో రూబియో చెప్పారు. విదేశీ పర్యాటకులు వీటికి లోబడే ఉండాలని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని గతంలో పలుమార్లు చెప్పినా జనాలకు ఎందుకు బోధపడటం లేదో తనకు అర్థం కావటం లేదని కామెంట్ చేశారు. అమెరికా వీసాను తమ హక్కుగా విదేశీయులు భావించొద్దని అన్నారు. అది కేవలం ఒక అనుమతి మాత్రమేనని చెప్పారు. వీసాలు పొందిన వారికి ప్రత్యేక చట్టపరమైన హక్కులు ఏవీ ఉండవని చెప్పారు. వీసా కచ్చితంగా ఇవ్వాలన్న రాజ్యాంగ నిబంధన ఏదీ లేదని అన్నారు. ‘టూరిస్టుగా, స్టూడెంట్‌గా, జర్నలిస్టుగా ఈ దేశంలోకి వచ్చిన వారు అమెరికా జాతీయ భద్రతకు విఘాతం కలిగించే పనులు చేశారంటే మీ వీసాలను తీసేసుకుంటాం’ అని హెచ్చరించారు.


వలసల నిరోధానికి అమెరికా ఇప్పటికే పలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. గత నెలలో ఏకంగా 75 దేశాల వారికి ఇమిగ్రెంట్ వీసాల జారీని నిలిపివేసింది. ఈ దేశాల వారు అమెరికా ప్రభుత్వ ఖజానాకు భారంగా మారుతున్నారని తెలిపింది.


ఇవీ చదవండి:

అమెరికాకు హెచ్-1బీ డాక్టర్లు అవసరం.. చట్టసభల సభ్యుల లేఖ

హెచ్-1బీ వీసా రద్దు కోసం అమెరికాలో మరో ప్రయత్నం!

Updated Date - Feb 17 , 2026 | 06:08 PM