ఇరాన్ దిశగా అమెరికా యుద్ధ నౌకలు.. మధ్యప్రాచ్యంలో ఆందోళనలు..
ABN , Publish Date - Feb 13 , 2026 | 01:36 PM
ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌకను కరేబియన్ సముద్రం నుంచి మధ్యప్రాచ్యానికి అమెరికా తరలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గత కొద్ది వారాలుగా అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌకను కరేబియన్ సముద్రం నుంచి మధ్యప్రాచ్యానికి అమెరికా తరలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గత కొద్ది వారాలుగా అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా సైన్యం గల్ఫ్ ప్రాంతంలో మోహరించింది. తాజాగా అమెరికాకు చెందిన అతిపెద్ద విమాన వాహక నౌక 'జెరాల్డ్ ఆర్ ఫోర్డ్' కూడా ఇరాన్ వైపు కదులుతున్నట్టు వార్తలు వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది (US aircraft carrier Middle East).
ఇటీవల వెనెజువెలాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్ట్ చేసిన సమయంలో ఈ 'జెరాల్డ్ ఆర్ ఫోర్డ్' నౌక నుంచే అమెరికా యుద్ధ విమానాలు దాడిలో పాల్గొన్నాయి. అదే నౌకను ఇప్పుడు ఇరాన్ వైపు పంపిస్తున్నారు. ఇప్పటికే ఇరాన్ సమీప ప్రాంతానికి అమెరికాకు చెందిన యుద్ధ విమాన వాహక నౌక 'యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్'ను తరలించారు. తాజాగా 'జెరాల్డ్ ఆర్ ఫోర్డ్'తో పాటు పలు ఎస్కార్టింగ్ నౌకలను కూడా అమెరికా అక్కడకు పంపుతోంది. ఇవి మే నెలలోనే వెనక్కి తిరిగి వస్తాయని వైట్ హౌస్ వర్గాలు పేర్కొన్నట్టు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది (USS Gerald R. Ford deployment).
ఒమన్ వేదికగా ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య పరోక్ష చర్చలు జరుగుతున్నాయి (Iran tensions 2026). ఈ చర్చలు గనుక విఫలమైతే ఇరాన్‌పై దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలోనే సంకేతాలు ఇచ్చారు. బుధవారం ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడిన తర్వాత ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్ సహేతుకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని తాను ఆశిస్తున్నానని, ఒకవేళ అలా జరగకపోతే ఫలితం ఎలా ఉంటుందో చూడాలని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి..
బంగ్లాదేశ్‌లో తారిక్ రెహ్మాన్ హవా.. పార్లమెంట్ ఎన్నికల్లో దూసుకెళ్తున్న బీఎన్‌పీ..
బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..