Share News

బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Feb 13 , 2026 | 06:32 AM

కొద్ది రోజుల క్రితం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న బంగారం, వెండి ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ రెండు లోహాలు రికార్డు గరిష్ఠాలను తాకి అంతే వేగంగా కిందకు వచ్చాయి. ప్రస్తుతం అంతర్జాతీయ, భౌగోళిక, రాజకీయ కారణాల నేపథ్యంలో స్థిరంగా కొనసాగుతున్నాయి.

బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
gold and silver rates today

కొద్ది రోజుల క్రితం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న బంగారం, వెండి ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ రెండు లోహాలు రికార్డు గరిష్ఠాలను తాకి అంతే వేగంగా కిందకు వచ్చాయి. ప్రస్తుతం అంతర్జాతీయ, భౌగోళిక, రాజకీయ కారణాల నేపథ్యంలో స్థిరంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం బంగారం స్వల్ప తగ్గుదల నమోదు చేసింది. వెండి ధర స్వల్పంగా పెరిగింది. (Gold prices).


ఈ రోజు (ఫిబ్రవరి 13న) ఉదయం 6:30 గంటల సమయంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,58,390కి చేరింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,190కి చేరింది (live gold rates). ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,58,540కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,45,340కి చేరుకుంది.


మరోవైపు వెండి ధరలో స్వల్ప పెరుగుదల నమోదైంది. శుక్రవారం కిలోకు వంద రూపాయల మేర వెండి ధర పెరిగింది. మళ్లీ మూడు లక్షల రూపాయల మార్క్ చేరువకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు పలు నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)

  • హైదరాబాద్‌లో రూ.1,58,390, రూ.1,45,190

  • విజయవాడలో రూ.1,58,390, రూ.1,45,190

  • ఢిల్లీలో రూ.1,58,540, రూ.1,45,340

  • ముంబైలో రూ.1,58,390, రూ.1,45,190

  • వడోదరలో రూ.1,58,440, రూ.1,45,240

  • కోల్‌కతాలో రూ.1,58,390, రూ.1,45,190

  • చెన్నైలో రూ.1,58,390, రూ.1,45,190

  • బెంగళూరులో రూ.1,58,390, రూ.1,45,190

  • కేరళలో రూ.1,58,390, రూ.1,45,190

  • పుణెలో రూ.1,58,390, రూ.1,45,190


ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)

  • హైదరాబాద్‌లో రూ.2,99,900

  • విజయవాడలో రూ.2,99,900

  • ఢిల్లీలో రూ.2,95,100

  • చెన్నైలో రూ.2,99,900

  • కోల్‌కతాలో రూ.2,95,100

  • కేరళలో రూ.2,99,900

  • ముంబైలో రూ.2,95,100

  • బెంగళూరులో రూ.2,95,100

  • వడోదరలో రూ.2,95,100

  • అహ్మదాబాద్‌లో రూ.2,95,100

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఇవి కూడా చదవండి..

114 రఫేల్ యుద్ధ విమానాలు, 6 పీ8ఐ విమానాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

స్పీకర్ ఛాంబర్‌లో కాంగ్రెస్ ఎంపీల వీరంగం.. వీడియో షేర్ చేసిన కిరణ్ రిజిజు

Updated Date - Feb 13 , 2026 | 06:50 AM