చైనా పర్యటనకు ట్రంప్ గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Feb 13 , 2026 | 11:04 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది ఏప్రిల్‌లో చైనాలో పర్యటించనున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలుసుకోనున్నారు. ఈ విషయాన్ని మీడియాకు ట్రంప్ తెలిపారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఈ ఏడాది ఏప్రిల్‌లో చైనా (China)లో పర్యటించనున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ (Jinping)ను కలుసుకోనున్నారు. ఈ విషయాన్ని మీడియాకు ట్రంప్ తెలిపారు.అయితే ఏ తేదీల్లో చైనాలో పర్యటించేది వెల్లడించలేదు. ఏప్రిల్‌లో చైనా వెళ్తానని, జిన్‌పింగ్ సైతం ఈ ఏడాది చివర్లో వైట్‌హౌస్‌కు వస్తారని, జిన్‌పింగ్‌తో భేటీకి ఎదురు చూస్తున్నామని చెప్పారు. జిన్‌పింగ్‌తో తనకు, తనతో జిన్‌పింగ్‌కు మంచి సంబంధాలున్నాయని చెప్పారు.
90 నిమిషాల ఫోన్ కాల్
ఈనెల 4న ట్రంప్-జిన్‌పింగ్ మధ్య 90 నిమిషాల పాటు ఫోన్ సంభాషణలు జరిగాయి. ప్రధానంగా వాణిజ్యం అంశాలపై సంభాషణలు జరిగాయని, ఇరాన్, ఉక్రెయిన్ వంటి అంతర్జాతీయ అంశాలపై ప్రస్తావన జరగలేదని ట్రంప్ తెలిపారు. ఈ కాల్ సందర్భంగా జిన్‌పింగ్ తనను, ఫస్ట్ లేడీని చైనాకు ఆహ్వానించారని, తాను కూడా ఉభయులను ఆహ్వానించానని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ తెలిపారు. రెండు అగ్రదేశాల అధ్యక్షులుగా ఉభయులు కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నట్టు చెప్పారు.
కాగా, ట్రంప్‌తో సంభాషణల సందర్భంగా నిలకడైన చైనా-అమెరికా సంబంధాల ప్రాధాన్యతను జిన్‌పింగ్ బలంగా నొక్కిచెప్పినట్టు జిన్‌హువా వార్తా సంస్థ తెలిపింది. పరిసర్ప గౌరవం ప్రాతిపదకగా 'విన్-విన్ రిజల్ట్స్' కోసం ఇరుదేశాలు పనిచేయనున్నట్టు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. చైనాపై ప్రతికూల ప్రభావం చూపించే చర్యలను అమెరికా వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
ఇవి కూడా చదవండి..