Home » Xi Jinping
అమెరికా పర్యటనకు వెళ్లిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఘన స్వాగతం పలికారు. ఆ సమయంలో భారీ శబ్దంతో బాంబర్లు దూసుకెళ్తున్నపుడు ట్రంప్ ముఖంలో కాస్త ఉలిక్కిపాటు కనిపించింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అమెరికాలో అడుగుపెట్టారు. మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా అమెరికా చేరుకున్న ఆయనకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా విమానాశ్రయంలో స్వాగతం పలికారు.
ఏఐ రంగంలో అమెరికా, చైనా మధ్య పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. అత్యాధునిక ఏఐ అభివృద్ధికి అవసరమైన చిప్‌లను చైనాకు అందకుండా చేయడం ద్వారా ఆ దేశ పురోగతిని అడ్డుకోవాలని అమెరికా భావిస్తోంది. అయితే ఇరు దేశాల మధ్య పోటీ కొనసాగుతున్నప్పటికీ ట్రంప్, జిన్‌పింగ్ సమావేశంలో ఏఐ సాంకేతికతకు సంబంధించి ఏదైనా ఒక అంశంపై ఒప్పందం కుదిరే అవకాశం ఉందని టెక్ కంపెనీలు భావిస్తున్నాయి.
న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు రెండో రోజు ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. బ్రిక్స్ దేశాల నేతలు తీసుకున్న ఒక ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తన విదేశీ పర్యటనలకు మాడిఫై చేసిన బోయింగ్ 747-8 విమానాన్ని వాడుతున్నారు. ఈ ఫ్లైట్‌ను ఎయిర్ చైనా ఆపరేట్ చేస్తుంది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆతిథ్యమిచ్చిన బ్రిక్స్ గాలా డిన్నర్‌కు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరుకాలేదు. ఈ విందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో పాటు పలు దేశాల నేతలు హాజరయ్యారు.
గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న సంక్షోభానికి పరిష్కారం చూపేందుకు బ్రిక్స్ దేశాలు ముందుండాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. ప్రపంచ శాంతి, స్థిరత్వాన్ని కాపాడటంలో బ్రిక్స్ దేశాలు కీలక పాత్ర పోషించాలని ఆయన కోరారు.
ప్రధాని నరేంద్ర మోదీ-చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ద్వైపాక్షిక భేటీ శనివారం సాయంత్రం న్యూఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో అడుగుపెట్టడానికి ముందు డ్రాగన్ కీలక సందేశం ఇచ్చింది. భారత్‌తో ఉన్న విభేదాలను జాగ్రత్తగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతామని చైనా స్పష్టం చేసింది.
భారత్ వేదికగా జరగనున్న బ్రిక్స్ సదస్సు కోసం వచ్చే వివిధ దేశాధినేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా కీలక ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు.