Share News

MEA Rejects Zinping Letter: రాష్ట్రపతికి జిన్‌పింగ్ లేఖపై ఎంఈఏ స్పందనిదే..

ABN , Publish Date - Sep 05 , 2025 | 06:24 PM

అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఇండియాతో సంబంధాల పునరుద్ధణకు ఆసక్తి కనబరుస్తూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గత మార్చిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రహస్య లేఖ రాసినట్టు 'బ్లూమ్‌బెర్గ్' ఒక కథనం ప్రచురించింది.

MEA Rejects Zinping Letter: రాష్ట్రపతికి జిన్‌పింగ్ లేఖపై ఎంఈఏ స్పందనిదే..
Jinping and Droupadi Murmu

న్యూఢిల్లీ: న్యూఢిల్లీతో సంబంధాల పునరుద్ధరణ కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu)కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ (Zinping) రహస్య లేఖ (Secret Letter) పంపినట్టు మీడియాలో వచ్చిన ఒక కథనాన్ని కేంద్రం కొట్టివేసింది. వార్తను ప్రచురించే ముందు బాధ్యతతో వ్యవహరించాలని మీడియాను కోరింది.


'మీడియాలో వచ్చిన కథనం మా దృష్టికి వచ్చింది. లేఖ రాయడంలో ఎంతమాత్రం నిజం లేదు' అని ఎంఈఏ ప్రతినిధ రణ్‌ధీర్ జైశ్వాల్ (Randhir Jaiswal) శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. వార్తను రిపోర్ట్ చేసేటప్పుడు మీడియా మిత్రులు తగిన బాధ్యతతో వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఇండియాతో సంబంధాల పునరుద్ధణకు ఆసక్తి కనబరుస్తూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గత మార్చిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రహస్య లేఖ రాసినట్టు 'బ్లూమ్‌బెర్గ్' (Bloomberg) ఒక కథనం ప్రచురించింది. యూఎస్‌తో ఎలాంటి డీల్ కుదుర్చుకున్నా అది చైనా ప్రయోజనాలకు భంగకరమవుతుందని జిన్‌పింగ్ ఆందోళన వ్యక్తం చేసినట్టు ఒక భారత అధికారిని ఉటంకిస్తూ ఆ కథనం పేర్కొంది.


జిన్‌పింగ్‌తో మోదీ కీలక భేటీ

2020 గల్వాన్ ఘర్షణల అనంతరం క్షీణించిన భారత్-చైనా సంబంధాలను తిరిగి మెరుగుపరుచుకునేందుకు భారత్-చైనా ఇటీవల ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఎస్‌సీఓ సదస్సులో పాల్గొనేందుకు చైనాలోని టియాంజిన్ వెళ్లారు. జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక భేటీ జరిపారు. పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం ప్రాతిపదికగా చైనాతో సంబంధాలను ముందుకు తీసుకువెళ్లేందుకు భారత్ కృతనిశ్చయంతో ఉందని మోదీ ప్రకటించారు. ఇండియా-చైనా మిత్రులుగా ఉండాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సైతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం సుంకాన్ని భారత్ వ్యతిరేకించడాన్ని బహిరంగంగానే సమర్ధించారు. ఈ క్రమంలోనే చైనాకు భారత్, రష్యా లొంగిపోయాయని ట్రంప్ శుక్రవారంనాడు సంచలన వ్యాఖ్యలు చేసారు.


ఇవి కూడా చదవండి..

చైనాకు లొంగిపోయిన భారత్-రష్యా.. ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు

34 వాహనాల్లో మానవబాంబులు.. బెదిరింపు మెసేజ్‌తో హైఅలర్ట్

For More National News And Telugu News

Updated Date - Sep 05 , 2025 | 06:29 PM