Share News

Trump: చైనాకు లొంగిపోయిన భారత్-రష్యా.. ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 05 , 2025 | 05:30 PM

ఎస్‌సీఓ సదస్సుకు చైనా ఇటీవల ఆతిథ్యం ఇచ్చింది. పది సభ్యదేశాలు, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రెస్ సహా 20 ఆహ్వానిత నేతలు ఒకే వేదిక మీదకు వచ్చారు.

Trump: చైనాకు లొంగిపోయిన భారత్-రష్యా.. ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు
Modi, Putin and Zinping

న్యూఢిల్లీ: సుంకాలు, ఉక్రెయిన్‌ యుద్ధంపై భారత్, రష్యా, చైనాలతో యూఎస్ (US) సంబంధాల్లో తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, రష్యాలు చైనాకు లొంగిపోయాయని తన 'ట్రూత్ సోషల్ ఫ్లాట్‌ఫాం' (Truth Social platform)లో వ్యాఖ్యానించారు. చైనాలోని టియాంజన్‌లో ఇటీవల ఎస్‌సీఓ సదస్సు జరగడం, అందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పాల్గొనడం, అగ్రనేతలు మువ్వురు ద్వైపాక్షిక భేటీలు జరిపిన నేపథ్యంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


'భారత్, రష్యాలు చైనాకు లొంగిపోయినట్టు కనిపిస్తోంది. వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆకాంక్షిస్తున్నాను' అని ట్రంప్ తన పోస్ట్‌లో అన్నారు. మోదీ, పుతిన్, జిన్‌పింగ్ పక్కపక్కనే నడుస్తున్న తాజా ఫోటోను కూడా ఆయన తన పోస్టుకు జతచేశారు.


భారత్ స్పందనిదే..

చైనాకు భారత్, రష్యా లొంగిపోయాయంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ ముక్తసరిగా స్పందించింది. దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదని ఎంఈఏ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ అన్నారు.


ఎస్‌సీఓ సదస్సుకు చైనా ఇటీవల ఆతిథ్యం ఇచ్చింది. పది సభ్యదేశాలు, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రెస్ సహా 20 ఆహ్వానిత నేతలు ఒకే వేదిక మీదకు వచ్చారు. ప్రాంతీయ శాంతి, సుస్థిరత పరిరక్షణ, ఐక్య, పటిష్ట గ్లోబల్ సౌత్ కోసం ఎస్‌సీఓ కలిసి పనిచేయాలని ప్రారంభోపన్యాసంలో జిన్‌పింగ్ అభిలషించారు.


ఇవి కూడా చదవండి..

సుప్రీం కోర్టులో అమెరికా ప్రభుత్వ పిటిషన్.. భారత్ ప్రస్తావన

ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ ఆర్మనీ కన్నుమూత

For More International News And Telugu News

Updated Date - Sep 05 , 2025 | 05:56 PM