Home » Droupadi Murmu
ఇటీవల ముగిసిన పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో 'వీబి-జీ రామ్ జీ' బిల్లును పార్లమెంటు ముందుకు కేంద్రం తీసుకువచ్చింది. సమవేశాల చివరిరోజు లోక్‌సభలో 8 గంటల చర్చ అనంతరం బిల్లుకు ఆమోదం లభించింది.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. ద్రౌపది ముర్ము నిన్ననే నగరానికి రాగా.. ఈరోజు(శనివారం) సీపీ రాధాకృష్ణన్ చేరుకున్నారు. ఇవాళ మధ్యాహ్న సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి ఆయన చేరుకోగా.. మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు ఘనస్వాగతం పలికారు.
ప్రతి ఏడాది రాష్ట్రపతి హోదాలో ఉన్నవారు శీతాకాల విడిది కోసం హైదరాబాద్ రావడం తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాలం విడిది కోసం హైదరాబాద్‌కు విచ్చేశారు. సికింద్రాబాద్ లోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు.
ఓ చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కేసులో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. రాష్ట్రపతి క్షమాభిక్షను కోరాడో నిందితుడు. అయితే.. అతడి పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించారు.
మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీకి అహ్వానం అందలేదని కాంగ్రెస్ వర్గాలు ధ్రువీకరించాయి. కీలక దౌత్య ప్రముఖులు హాజరయ్యే కార్యక్రమంలో తమ నేతలకు ఆహ్వానం లేకపోవడంపై ఆ వర్గాల్లో చర్చ జరుగుతోంది
పోలీసు పహారాలో పుట్టపర్తి కొనసాగుతోంది. సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలకు దేశంలోని ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో పుట్టపర్తిలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈనెల 19న భారత ప్రధాని నరేంద్రమోదీ, 22, 23 తేదీల్లో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పుట్టపర్తికి రానున్నారు.
రఫేల్ ఫైటర్ జెట్‌ను నడిపిన తొలి ఇండియన్ మహిళా పైలట్‌గా శివాంగి సింగ్ రికార్డుల్లో నిలిచారు. దీనికి ముందు ఆమె అంబాలోని గోల్డెన్ యారోస్ స్వ్కాడ్రన్‌లో విధులు నిర్వహించారు.
భారత వైమానికి దళానికి చెందిన రఫేల్ యుద్ధ విమానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విహరిస్తున్నారు. ముందుగా భద్రతా దళాల నుంచి సైనిక వందనం స్వీకరించారు.
అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఇండియాతో సంబంధాల పునరుద్ధణకు ఆసక్తి కనబరుస్తూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గత మార్చిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రహస్య లేఖ రాసినట్టు 'బ్లూమ్‌బెర్గ్' ఒక కథనం ప్రచురించింది.
మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 'ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు-2025'ను లోక్‌సభ ఈనెల 20న ఆమోదించగా, 21న రాజ్యసభ ఆమోదం పొందింది.