కేంద్ర ఆర్థిక మంత్రికి, ఆమె బృందానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు
ABN , Publish Date - Feb 01 , 2026 | 10:28 AM
నేడు (ఫిబ్రవరి 1, 2026) కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్‌కు చేరుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను కలిశారు. ఇది ఏటా జరిగే ఒక ముఖ్యమైన రాజ్యాంగ, ఇంకా గౌరవప్రదమైన సాంప్రదాయం.
ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 1: కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందు, కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులతో కలిసి రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ పత్రాలు అందజేశారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఆర్థిక మంత్రికి చెక్కర, పెరుగు తినిపించారు.
బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సందర్భంగా రాష్ట్రపతి, కేంద్ర ఆర్థిక మంత్రికి, ఆమె బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భాన్ని రాష్ట్రపతి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ చిత్రాలు మీకోసం..
ఇవి కూడా చదవండి..
పాకిస్థాన్‌తో ప్రపంచకప్ మ్యాచ్.. కుర్రాళ్లతో సచిన్, లక్ష్మణ్ చిట్‌చాట్..
ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..