Share News

పాకిస్థాన్‌తో ప్రపంచకప్ మ్యాచ్.. కుర్రాళ్లతో సచిన్, లక్ష్మణ్ చిట్‌చాట్..

ABN , Publish Date - Feb 01 , 2026 | 07:10 AM

అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా యువ భారత జట్టు ఆదివారం పాకిస్థాన్‌తో కీలక మ్యాచ్ ఆడబోతోంది. ఆయుష్ మాత్రే నేతృత్వంలోని యువ జట్టు కీలక మ్యాచ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వారిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాడు.

పాకిస్థాన్‌తో ప్రపంచకప్ మ్యాచ్.. కుర్రాళ్లతో సచిన్, లక్ష్మణ్ చిట్‌చాట్..
Sachin Tendulkar pep talk

అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా యువ భారత జట్టు ఆదివారం పాకిస్థాన్‌తో కీలక మ్యాచ్ ఆడబోతోంది. ఆయుష్ మాత్రే నేతృత్వంలోని యువ జట్టు కీలక మ్యాచ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వారిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాడు. ఆయుష్ మాత్రే, వైభవ్ సూర్యవంశీతో పాటు ఇతర ఆటగాళ్లతో వర్చువల్‌గా మాట్లాడాడు. సచిన్‌తో పాటు లక్ష్మణ్ కూడా యువ ఆటగాళ్లకు పలు కీలక సూచనలు చేశాడు (Sachin Tendulkar pep talk).


ఆయా ఫొటోలోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'ప్రస్తుతం అండర్ 19 ప్రపంచ కప్‌లో ఆడుతున్న భారత యువ జట్టు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో వర్చువల్ సంభాషణలో పాల్గొంది' అని బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా, ఈ రోజు జరగబోయే మ్యాచ్ ఇరు జట్లకూ చాలా కీలకమైనది. సూపర్-6లో ఇది చివరి మ్యాచ్. ఈ గ్రూప్ నుంచి ఇప్పటికే ఇంగ్లండ్ సెమీ-ఫైనల్‌కు చేరుకోవడంతో భారత్, పాక్ మరో స్థానం కోసం పోటీ పడుతున్నాయి (Team India U19 World Cup).


భారత్‌ ఇప్పటివరకు సూపర్-6లో మూడు మ్యాచ్‌లు ఆడి ఆరు పాయింట్లతో ఉంది (India vs Pakistan U19 clash). పాకిస్థాన్ మూడు మ్యాచ్‌లు ఆడి నాలుగు పాయింట్‌లతో ఉంది. భారత జట్టు మెరుగైన నెట్-రన్ రేట్‌ను కలిగి ఉంది. ఈ నేపథ్యంలో పాక్ సెమీస్‌కు అర్హత సాధించాలంటే భారీ విజయం అవసరం. ఒకవేళ ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయినా సెమీస్‌కు చేరుకోవచ్చు. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు గెలిస్తే గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచి సెమీస్‌కు చేరుకుంటుంది.


ఇవి కూడా చదవండి..

ఆర్థిక శాఖ మినహా సునేత్రకు మూడు శాఖలు..

మహారాష్ట్ర డీసీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సునేత్ర పవార్

For More National News And Telugu News

Updated Date - Feb 01 , 2026 | 07:10 AM