Xi Jinping: అమెరికా బెదిరింపులు సాగవు: జిన్‌పింగ్
ABN , Publish Date - Sep 02 , 2025 | 01:20 AM
ఎస్‌సీవో సదస్సు వేదికగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అమెరికాకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.
టియాంజిన్, సెప్టెంబరు 1: ఎస్‌సీవో సదస్సు వేదికగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అమెరికాకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. అంతర్జాతీయ సమాజంలో బెదిరింపు ధోరణిని అంగీకరించబోమని, నిష్పాక్షిత, న్యాయం, బహుళత్వానికి ప్రాధాన్యం ఉండాలని జిన్‌సింగ్ అన్నారు. చైనాతో సహా ఇతర దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకపక్షంగా సుంకాలు విధించడాన్ని ఉద్దేశించే జిన్‌సింగ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు.
సదస్సులో జిన్‌సింగ్ మాట్లాడుతూ.. ఐక్యరాజ్యసమితి కేంద్రీకృత వ్యవస్థలైన ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) వంటి వాటిని రక్షించుకోవాలన్నారు. ఎస్‌సీవో సభ్యదేశాలు పరస్పర ప్రయోజనాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. విభేదాలను పక్కనపెట్టి ఒక్కటవ్వాలని, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఏకాభిప్రాయంతో ఉండాలని అన్నారు. అప్పుడే ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, అభివృద్ధి సాధ్యమన్నారు.