PM Modi-Xi Jinping: మోదీ-షీ జిన్‌పింగ్ భేటీ..చైనా విషయంలో అప్రమత్తత అవసరం
ABN, Publish Date - Sep 01 , 2025 | 09:51 PM
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య జరిగిన భేటీ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో చైనా విషయంలో భారత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi), ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్(Xi Jinping)తో తియాన్‌జిన్‌లో జరిగిన SCO సదస్సులో భేటీ అయ్యారు. ఈ సమావేశం రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి ఒక మైలురాయిగా భావిస్తున్నారు. షీ జిన్‌పింగ్, భారత్-చైనా స్నేహం డ్రాగన్, ఏనుగు కలిసి నృత్యం చేయడమని పేర్కొన్నారు. మోదీ, పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వంతో సంబంధాలను బలోపేతం చేయాలని పేర్కొన్నారు.
2020 గల్వాన్ ఘర్షణ తర్వాత సరిహద్దు ఉద్రిక్తతలు తగ్గాయని, కైలాస మానసరోవర్ యాత్ర, ప్రత్యక్ష విమానాలు పునరుద్ధరణ జరిగాయని మోదీ తెలిపారు. మరోవైపు చైనాతో దీర్ఘకాల సమస్యలు, సరిహద్దు వివాదాలు ఇప్పటికీ ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డ్రాగన్ స్నేహానికి చేయి కలిపినట్లు అనిపించినా, వెనుక వేరే కుట్ర ఉండే అవకాశం ఉందని విదేశాంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Updated at - Sep 01 , 2025 | 09:51 PM