PM Modi To Meet Xi Jinping: ఏడేళ్ల తర్వాత చైనాకు మోదీ.. ఇక అమెరికాకు మామూలుగా ఉండదు..
ABN , Publish Date - Aug 28 , 2025 | 03:05 PM
2018లో జరిగిన ఇన్‌ఫార్మల్ సమిట్‌కు మోదీ వెళ్లారు. వూహాన్‌లో చైనా అధ్యక్షుడితో భేటీ అయ్యారు. తర్వాతి కాలంలో రెండు దేశాల మధ్య సరిహద్దుల గొడవల వల్ల సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి.
ఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటన తేదీ ఖరారు అయింది. ఈనెల 31వ తేదీన ఆయన చైనా వెళ్లనున్నారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ధ్వైపాక్షిక సమావేశాలు జరపనున్నారు. అంతేకాదు.. సెప్టెంబర్ 1వ తేదీన రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్‌తోనూ ఆయన భేటీ కానున్నారు. షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) సమిట్‌లో పాల్గొననున్నారు. ప్రపంచం దృష్టంతా మోదీ.. చైనా పర్యటనపైనే పడింది. రష్యాతో చమురు వ్యాపారాల కారణంగా అమెరికా దారుణమైన రీతిలో టారిఫ్‌లు విధించింది.
భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై ఏకంగా 50 శాతం టారిఫ్‌లు విధించింది. దీంతో ఇండియా వ్యాపారం మెల్లమెల్లగా దెబ్బతింటూ వస్తోంది. మరోవైపు చైనాపైనా అమెరికా భారీ స్థాయిలో టారిఫ్‌లు విధించింది. ఇలా అమెరికా కారణంగా భారీఎత్తున వ్యాపారాలు నష్టపోయిన భారత్, చైనాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. దానికి తోడు దాదాపు ఏడేళ్ల తర్వాత ప్రధాని మోదీ చైనా వెళుతున్నారు. చైనా అధ్యక్షుడ్ని కలవబోతున్నారు.
2018లో జరిగిన ఇన్‌ఫార్మల్ సమిట్‌కు మోదీ వెళ్లారు. వూహాన్‌లో చైనా అధ్యక్షుడితో భేటీ అయ్యారు. తర్వాతి కాలంలో రెండు దేశాల మధ్య సరిహద్దుల గొడవల వల్ల సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. రెండు దేశాల నేతలు బయట కలవటం తప్ప.. చైనాకు మోదీ వెళ్లింది లేదు. అమెరికాతో టారిఫ్ వార్ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు దేశాల నేతలు సరిహద్దుల గొడవలు, యూఎస్ టారీఫ్‌లతోపాటు మరికొన్ని కీలక విషయాలపై చర్చించనున్నారు.
ఇవి కూడా చదవండి
రీల్ కోసం సాహసం.. కదులుతున్న రైలుకు వెలాడుతూ వీడియో తీస్తుంటే.. షాక్..
మీది హెచ్‌డీ చూపు అయితే.. ఈ టేబుల్‌పై ఉన్న రెండు స్పూన్‌లను 10 సెకెన్లలో కనిపెట్టండి..