Share News

Train reel video: రీల్ కోసం సాహసం.. కదులుతున్న రైలుకు వెలాడుతూ వీడియో తీస్తుంటే.. షాక్..

ABN , Publish Date - Aug 28 , 2025 | 02:56 PM

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక రైలు వేగంగా వెళ్తోంది. ఆ సమయంలో ఒక వ్యక్తి రైలు గేట్‌కు వేలాడుతూ తన మొబైల్‌లో వీడియోను చిత్రీకరించుకుంటున్నాడు. ఆ సమయంలో కింద నిలబడి ఉన్న ఓ దొంగ..

Train reel video: రీల్ కోసం సాహసం.. కదులుతున్న రైలుకు వెలాడుతూ వీడియో తీస్తుంటే.. షాక్..
train reel video

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలోనూ ఉండే తప్పనిసరి వస్తువు మొబైల్. ఫోన్ లేకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లేవారి సంఖ్య చాలా తక్కువ. దీంతో ఎక్కడ పడితే అక్కడ ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ అన్నింటినీ కెమెరాలో బంధించాలనే ఆత్రుత చాలా మందిలో పెరిగింది. ఈ క్రమంలో కొందరు లేనిపోని ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు వేగంగా వెళ్తున్న రైలుకు వేలాడుతూ వీడియో తీసుకుంటుండగా అనుకోని ప్రమాదం జరిగింది (viral train video).


@nainasingh1992 అనే ఎక్స్ ఖాతాలో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక రైలు వేగంగా వెళ్తోంది. ఆ సమయంలో ఒక వ్యక్తి రైలు గేట్‌కు వేలాడుతూ తన మొబైల్‌లో వీడియోను చిత్రీకరించుకుంటున్నాడు (man hangs out of train). ఆ సమయంలో కింద నిలబడి ఉన్న ఓ దొంగ కర్రతో అతడి చేతిపై కొట్టాడు. దీంతో ఆ వ్యక్తి మొబైల్‌ను వదిలేశాడు. రైలు వేగంగా వెళ్తోంది కాబట్టి అతడు తన మొబైల్‌ను తిరిగి తీసుకోలేకపోయాడు. బాధతో కూర్చుండిపోయాడు. ఈ ఘటనను మరో వ్యక్తి చిత్రీకరించాడు (reel gone wrong).


ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు వేల మంది వీక్షించారు. వందల మంది ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఇలా రీల్ చేసే వారు తప్పక చూడాల్సిన వీడియో ఇదని ఒకరు కామెంట్ చేశారు. ఇతడికి తగిన శాస్తి జరిగిందని మరొకరు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

ఈ పాము చాలా సంస్కారవంతమైనది.. మొబైల్‌లో అశ్లీల పాట చూసి ఏం చేసిందంటే..

రూ.100 పెట్టి షేర్ కొంటే.. రూ.3000 భోజనం ఫ్రీ.. ఆ రోజులు పోయాయంటే సీఏ ఆసక్తికర పోస్ట్..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 28 , 2025 | 03:21 PM