Share News

Snake watching video: ఈ పాము చాలా సంస్కారవంతమైనది.. మొబైల్‌లో అశ్లీల పాట చూసి ఏం చేసిందంటే..

ABN , Publish Date - Aug 26 , 2025 | 03:37 PM

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో తెలియదు. ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆసక్తికరంగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటాయి.

Snake watching video: ఈ పాము చాలా సంస్కారవంతమైనది.. మొబైల్‌లో అశ్లీల పాట చూసి ఏం చేసిందంటే..
snake watching video

సోషల్ మీడియాలో ఎప్పుడు, ఏ వీడియో వైరల్ అవుతుందో తెలియదు. ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆసక్తికరంగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా జంతువులుకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంటాయి. నమ్మలేని విధంగా ఉండే వీడియోలు ఇటీవలి కాలంలో మన కళ్ల ముందుకు వస్తున్నాయి. తాజాగా అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Bhojpuri song reaction).


@NazneenAkhtar23 అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక స్మార్ట్‌ఫోన్‌ను స్టాండ్‌పై ఉంచి వీడియో ప్లే చేశారు. ఆ ఫోన్‌లో భోజ్‌పురి పాట ప్లే అవుతోంది. ఆ వీడియోలో హీరో, హీరోయిన్ డ్యాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. అంతలో ఒక పాము అక్కడకు వచ్చి కాసేపు ఆ పాటను చూసింది. ఆ తర్వాత తన నాలుకతో ఆ పాటను ఆపేసింది. ఆ పాట నచ్చలేనట్టుగా అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయింది. పాము ఇలా ప్రవర్తించడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. దీంతో ఇది ఏఐ వీడియో అని చాలా మంది అనుకుంటున్నారు (snake stops video).


ఈ వీడియో (snake reacts to obscenity) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు కొన్ని లక్షల మంది వీక్షించారు. వందల మంది ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. నాగ్ బాబాకు భోజ్‌పురి పాట అస్సలు నచ్చలేదని ఒకరు కామెంట్ చేశారు. ఆ పాటకు, డ్యాన్స్‌కు నాగరాజు ఇచ్చిన రివ్యూ అది అని మరొకరు పేర్కొన్నారు. ఈ వీడియో నిజమైనదేనా అని మరొకరు ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి..

పిల్లలకు బాతు జీవిత పాఠం.. సరస్సులో పిల్లలతో తల్లి బాతు ఎలా ఆడుతోందో చూడండి..

మీ చూపు చురుకైనది అయితే.. ఈ 37ల మధ్యలో భిన్నమైన వాటిని 10 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 26 , 2025 | 03:37 PM