Parenting lessons: పిల్లలకు బాతు జీవిత పాఠం.. సరస్సులో పిల్లలతో తల్లి బాతు ఎలా ఆడుతోందో చూడండి..
ABN , Publish Date - Aug 25 , 2025 | 03:59 PM
ఈ ప్రపంచంలో ఏ జంతువుకైనా తన పిల్లలతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. తన పిల్లలు ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలనే ఏ తల్లైనా కోరుకుంటుంది. అందుకోసం అవసరమైన అన్ని విద్యలు నేర్పుతుంది. జంతువులు కూడా తమ పిల్లలకు వేట నైపుణ్యాలు, జీవిత పాఠాలు తమదైన శైలిలో చెబుతాయి.
ఈ ప్రపంచంలో ఏ జంతువుకైనా తన పిల్లలతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. తన పిల్లలు ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలనే ఏ తల్లైనా కోరుకుంటుంది. అందుకోసం అవసరమైన అన్ని విద్యలు నేర్పుతుంది. జంతువులు కూడా తమ పిల్లలకు వేట నైపుణ్యాలు, జీవిత పాఠాలు తమదైన శైలిలో చెబుతాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ తల్లి బాతు తన పిల్లలతో ఆటలాడుతోంది (duck playing hide and seek).
@Rainmaker1973 అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను (heartwarming video) సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ సరస్సులో ఒక బాతు తన ఏడు పిల్లలతో కలిసి ప్రయాణిస్తోంది. ఒకచోట ఆ తల్లి బాతు నీటి లోపలికి వెళ్లిపోయింది. దాంతో పిల్ల బాతులు అయోమయానికి గురయ్యాయి. కాసేపటికి వేరే చోట నుంచి తల్లి బాతు బయటకు వచ్చింది. దీంతో ఆ పిల్లలు వెంటనే తల్లి దగ్గరకు వెళ్లిపోయాయి. వెంటనే ఆ తల్లి బాతు మరోసారి అలాగే నీటి లోపలికి వెళ్లిపోయి వేరే చోట నుంచి బయటకు వచ్చింది. పిల్లలు వెంటనే తల్లి దగ్గరకు వెళ్లిపోయాయి (ducks teaching life lessons).
ఈ వీడియో (animal fun) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు వేల మంది వీక్షించారు. వందల మంది ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. తాను ఎక్కడికైనా వెళితే చింతించవద్దని ఆమె తన పిల్లలకు నేర్పుతోందని ఒకరు కామెంట్ చేశారు. ఆ బాతు తన పిల్లలకు మనుగడ నేర్పుతోందని మరొకరు పేర్కొన్నారు. దాగుడుమూతల ఆట ఇక్కడి నుంచే ప్రారంభమైంది అంటూ మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. గద్దకు ఇంత బలముంటుందా.. జింక పిల్లను ఎలా పట్టుకుందో చూడండి..
ఇది రాజమౌళి ఈగ కంటే పవర్‌ఫుల్.. ఓ గోల్ఫర్‌కు రూ.8 కోట్లు సంపాదించిపెట్టింది..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..