Rs 100 share story: రూ.100 పెట్టి షేర్ కొంటే.. రూ.3000 భోజనం ఫ్రీ.. సీఏ ఆసక్తికర పోస్ట్..
ABN , Publish Date - Aug 26 , 2025 | 03:53 PM
ఏదైనా కంపెనీకి సంబంధించిన షేర్లు కొంటే మనం కూడా ఆ సంస్థలో భాగస్వాముల కిందే లెక్క. ఆ సంస్థ నిర్వహించే సమావేశాలకు హాజరయ్యే అవకాశం దొరుకుతుంది. కాస్త ఎక్కువ షేర్లు కొంటే ఆ కంపెనీ విధాన నిర్ణయాల్లో కూడా మనం మన అభిప్రాయాలను చెప్పవచ్చు.
ఏదైనా కంపెనీకి సంబంధించిన షేర్లు కొంటే మనం కూడా ఆ సంస్థలో భాగస్వాముల కిందే లెక్క. ఆ సంస్థ నిర్వహించే సమావేశాలకు హాజరయ్యే అవకాశం దొరుకుతుంది. కాస్త ఎక్కువ షేర్లు కొంటే ఆ కంపెనీ విధాన నిర్ణయాల్లో కూడా మనం మన అభిప్రాయాలను చెప్పవచ్చు. ప్రతి ఏటా జరిగే వార్షిక సమావేశాలకూ హాజరుకావచ్చు. గతంలో ఈ సమావేశాల కోసం ప్రత్యేకంగా హోటల్స్ బుక్ చేసేవారు. అయితే కరోనా తర్వాత పరిస్థితి మారిపోయింది. ఆన్‌లైన్‌లోనే సమావేశాలు జరిగిపోతున్నాయి (stock market perks).
దినేష్ జ్ఞాని అనే ఛార్టెడ్ అకౌంటెంట్ తాజాగా చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడు గతంలో ఇండియన్ హోటల్స్‌కు చెందిన ఒక షేర్‌ను రూ.100కు కొన్నారు. ఆ సంస్థ ముంబైలోని తాజ్ హోటల్‌లో నిర్వహించిన వార్షిక సమావేశానికి హాజరై రూ.3000 విలువైన లంచ్ బఫెట్‌ను ఉచితంగా తిన్నారు (Taj buffet offer). 'ఆనాటి గోల్డెన్ డేస్‌ను మిస్సవుతున్నా. అది నిజంగా విలువైన పెట్టుబడి' అని దినేష్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది (value investing).
అలాగే 2020లో వికాస్ ప్రాపర్టీస్ వాటాలు కొన్నప్పుడు.. ఐటీసీ జోధ్‌పూర్‌లో ఒక రాత్రి బస, భోజనం ఉచితంగా లభించిందని దినేష్ తెలిపారు (CA investment story). కొవిడ్ తర్వాత అలాంటి సమావేశాలన్నీ ఆన్‌లైన్‌కు మారిపోయాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో చాలా మంది ఆ పోస్ట్‌పై తమ స్పందనలను తెలియజేశారు. కంపెనీ ఏజీఎంల సందర్భంగా తమకు బహుమతులు, కూపన్లు లభించేవని కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
ఈ పాము చాలా సంస్కారవంతమైనది.. మొబైల్‌లో అశ్లీల పాట చూసి ఏం చేసిందంటే..
మీ చూపు చురుకైనది అయితే.. ఈ 37ల మధ్యలో భిన్నమైన వాటిని 10 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..