Share News

రష్యాలో వాట్సాప్‌పై నిషేధం

ABN , Publish Date - Feb 13 , 2026 | 06:12 AM

రష్యాలో వాట్సా్‌పపై పుతిన్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. దేశ చట్టాలను అమలు చేయనందుకు ఈ చర్య తీసుకున్నామని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి డిమిట్రీ...

రష్యాలో వాట్సాప్‌పై నిషేధం

మాస్కో, ఫిబ్రవరి 12: రష్యాలో వాట్సా్‌పపై పుతిన్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. దేశ చట్టాలను అమలు చేయనందుకు ఈ చర్య తీసుకున్నామని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి డిమిట్రీ ప్రెస్కోవ్‌ తెలిపారు. వాట్సాప్‌ మాతృ సంస్థ అయిన మెటా మొండివైఖరిని వీడి చర్చలకు వస్తే పునరుద్ధరించే అవకాశం ఉందని చెప్పారు. ఉగ్రవాద కార్యకలాపాలు, బెదిరింపు చర్యలకు వాట్సాప్‌ వేదికగా మారడంతో నిషేధం విధించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. ప్రత్యామ్నాయంగా మ్యాక్స్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంది. దీనిపై వాట్సాప్‌ స్పందిస్తూ ప్రభుత్వ ఆధీనంలోని నిఘా యాప్‌ను ప్రజలపై రుద్దడానికే తమపై నిషేధం విధించినట్టు ఆరోపించింది. మరోవైపు తమ కంపెనీకి కూడా ఇబ్బందులు కలిగిస్తున్నారని టెలిగ్రాం వ్యవస్థాపకుడు పవేల్‌ దురోవ్‌ ఆరోపణలు చేయడం గమనార్హం.

ఇవి కూడా చదవండి..

114 రఫేల్ యుద్ధ విమానాలు, 6 పీ8ఐ విమానాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

స్పీకర్ ఛాంబర్‌లో కాంగ్రెస్ ఎంపీల వీరంగం.. వీడియో షేర్ చేసిన కిరణ్ రిజిజు

Updated Date - Feb 13 , 2026 | 06:19 AM