ఎన్నికల కమిషన్‌కు బడ్జెట్‌లో భారీగా నిధుల పెంపు
ABN , Publish Date - Feb 01 , 2026 | 06:59 PM
ఎన్నికల కమిషన్‌కు 2025-26లో రూ.304.98 కోట్లు బడ్జెట్‌లో కేటాయించగా, 2026-27 బడ్జెట్‌లో ఈ మెుత్తాన్ని రూ.382.22 కోట్లకు పెంచారు.
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) లోక్‌సభలో ఆదివారంనాడు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ (Union Budget 2026)లో ఎన్నికల కమిషన్ (Election Commission)కు నిధుల కేటాయింపు 25.33 శాతం పెరిగింది. 2025-26లో రూ.304.98 కోట్లు బడ్జెట్‌లో కేటాయించగా, 2026-27 బడ్జెట్‌లో ఈ మెుత్తాన్ని రూ.382.22 కోట్లకు పెంచారు.
ఎన్నికల సంఘానికి కేటాయించిన నిధుల్లో రూ.367.69 కోట్లు ఎన్నికల సంబంధిత వ్యయం కాగా, తక్కిన మొత్తాన్ని పరిపాలన, నిర్వహణా ఖర్చులకు వెచ్చిస్తారు. రాబోయే రెండేళ్లలో పలు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం రెండో విడత ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియలో అధికార బీజేపీతో ఎన్నికల సంఘం కుమ్మక్కై పెద్దఎత్తున ఓటర్లను తొలగిస్తున్నారంటూ విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఈసీకి బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు 25 శాతం పెరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఏడాది తమిళనాడు, పశ్చిమబెంగాల్, అస్సాం, కేరళ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా, 2027లో ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లో ఎన్నికలు ఉంటాయి.
న్నికల కమిషన్‌కు కేంద్రం కేటాయించిన నిధులను సాంకేతికత, ఎన్నికల నిర్వహణ, ఓటర్ల అవగాహన తదితర కార్యక్రమాల కోసం వినియోగిస్తారు. ఈవీఎంలు, వీవీపాట్ యంత్రాల ఆధునీకరణ, పోలింగ్ కేంద్రాల భద్రతకు కూడా ఈ నిధులు వెచ్చిస్తారు.
ఇవి కూడా చదవండి
అబద్ధాల కుప్ప, బెంగాల్‌కు ఒక్క పైసా విదల్చలేదు: మమతా బెనర్జీ
దేశంలో వాస్తవ సంక్షోభాలను పట్టించుకోని బడ్జెట్: రాహుల్ గాంధీ