ఓటుకు రూ.70 వేల మంత్రం ఫలించింది!
ABN , Publish Date - Feb 14 , 2026 | 04:38 AM
మొయినాబాద్ మునిసిపాలిటీ ఎన్నికల్లో ఓ వార్డు నుంచి పోటీ చేసి దాదాపు రూ.7 కోట్లు ఖర్చు చేసిన స్వతంత్ర అభ్యర్థి ఘన విజయం సాధించారు.
భారీ మెజార్టీతో స్వతంత్ర అభ్యర్థి గెలుపు
వైరల్ అయిన ‘ఆంధ్రజ్యోతి’ కథనం..
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): మొయినాబాద్ మునిసిపాలిటీ ఎన్నికల్లో ఓ వార్డు నుంచి పోటీ చేసి దాదాపు రూ.7 కోట్లు ఖర్చు చేసిన స్వతంత్ర అభ్యర్థి ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థిపై 200కి పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనతో పాటు మరో నలుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందడంతో చైర్మన్ ఎన్నికల్లో వీరే కీలకంగా మారారు. సదరు స్వతంత్ర అభ్యర్థి ఓట్ల కోసం భారీగా తాయిలాలు పంచిన విషయమై శుక్రవారం ‘ఒక్కో ఓటుకు రూ.70 వేలు!’ అంటూ ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనం సంచలనం సృష్టించడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిం ది. ఓటుకు రూ.70 వేల నగదుతో పాటు పట్టుచీర, పాతిక కిలోల బియ్యం, నూనె డ బ్బా, నెలకు సరిపడా పప్పు దినుసులు పంచిన సదరు అభ్యర్థి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వార్డు ప్రజలు గెలిపించారు. చైర్మన్ ఎన్నికల్లో సదరు స్వతంత్ర అఽభ్యర్థి కీలకంగా మారడంతో ఆయన్ను సన్నిహితులు సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది.