Hyderabad: భర్త చేతిలో భార్య హతం.. పోలీసుల అదుపులో నిందితుడు
ABN , Publish Date - Jan 20 , 2026 | 09:16 AM
హైదరాబాద్‌లోని బోరబండలో దారుణం చోటు చేసుకుంది. అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్య తలపై రోకలి బండతో భర్త దాడి చేశాడు. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందింది.
హైదరాబాద్, జనవరి 20: మూడు ముళ్ల బంధంతో ఏడు అడుగులు వేసి తనతో వచ్చిన భార్యపై ఓ భర్త అనుమానం పెంచుకున్నాడు. ఆ ఆగ్రహంతో ఆమెపై రోకలి బండతో దాడి చేశాడు. దీంతో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన హైదరాబాద్ బోరబండ అహ్మద్‌నగర్ డివిజన్‌లోని రాజీవ్ నగర్‌లో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. భార్య సరస్వతి(35)పై భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో దంపతుల మధ్య తరచూ ఘర్షణ జరిగేది. అలాగే మంగళవారం మరోసారి ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహించిన భర్త.. భార్య తలపై రొకలి బండతో బలంగా కొట్టాడు. తలకు తీవ్ర గాయం కావడంతో.. ఆమె ప్రాణాలు కోల్పోయింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న బోరబండ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా స్థానికులను విచారిస్తున్నారు పోలీస్ అధికారులు.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
జ్యూరిక్‌లో సీఎం రేవంత్‌కు ఘన స్వాగతం
For More TG News And Telugu News