Share News

Vijayawada Hyderabad Traffic: విజయవాడ - హైదరాబాద్ హైవేపై భారీ రద్దీ.. పోలీసుల చర్యలివే..

ABN , Publish Date - Jan 19 , 2026 | 03:54 PM

సంక్రాంతి సెలవులు ముగించుకుని సొంతూర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలతో విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారి రద్దీగా మారింది. పోలీసులు భారీ వాహనాలను హనుమాన్ జంక్షన్ వద్ద నూజివీడు, మైలవరం మార్గం ద్వారా హైదరాబాద్ పంపిస్తున్నారు.

Vijayawada Hyderabad Traffic: విజయవాడ - హైదరాబాద్ హైవేపై భారీ రద్దీ.. పోలీసుల చర్యలివే..
Vijayawada Hyderabad Traffic

ఎన్టీఆర్ జిల్లా, జనవరి 19: సంక్రాంతి సెలవులు ముగిశాయి. పండగ కోసం సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు హైదరాబాద్‌‌కు తిరుగు పయనమయ్యారు. దీంతో విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి(NH-65) వాహనాలతో రద్దీగా మారింది. ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం వద్ద వాహన రద్దీ నెలకొనడంతో.. వాహనాలు క్యూ కట్టాయి. ఈ మేరకు పోలీసులు వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ నియంత్రణ చేపట్టారు. భారీ వాహనాలను హనుమాన్ జంక్షన్ వద్ద నూజివీడు, మైలవరం మార్గం ద్వారా హైదరాబాద్ వైపు మళ్లిస్తున్నారు. దీని వల్ల మెయిన్ హైవేలో రద్దీ కొంత మేర తగ్గే అవకాశం ఉంది.


కాగా.. సంక్రాంతి పండుగ కోసం స్వగ్రామాలకు వెళ్లే సమయంలోనూ ఈ రహదారిపై భారీ రద్దీ నెలకొన్న విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి ఏపీ వైపు వెళ్లే వాహనాలతో పంతంగి, చౌటుప్పల్ టోల్ గేట్ల వద్ద రద్దీ కారణంగా వాహనాలు ఆలస్యంగా నడిచాయి. ఇప్పుడు సొంతూళ్ల నుంచి హైదరాబాద్‌కు తిరిగొచ్చే సందర్భంలో రద్దీ మరింత పెరిగింది. ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, కంచికచర్ల వంటి చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు అదనపు సిబ్బందిని, డైవర్షన్లు అమలుచేసి సాఫీగా ప్రయాణం కొనసాగేలా చర్యలు చేపట్టారు. అలాగే ప్రయాణికులు ఓపికగా ఉండాలని, రద్దీ ఎక్కువగా ఉన్న చోట్ల వేగం తగ్గించి, సురక్షితంగా ప్రయాణం చేయాలని సూచిస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

రాజకీయ యాత్ర కాదు.. దేవుడి మొక్కు మాత్రమే: బండ్ల గణేష్

వేమన నీతి సూత్రాలు సమాజానికి అనుసరణీయం: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 19 , 2026 | 04:39 PM