Chandrababu Naidu Davos Tour: ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ..
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:59 PM
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు బృందం దావోస్‌కు పయనమైంది. జ్యూరిచ్‌లో ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.
అమరావతి, జనవరి 19: యూరప్‌లోని దావోస్ వేదికగా జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బయలుదేరి వెళ్లారు. జ్యూరిచ్‌కు చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు బృందానికి యూరప్‌లోని 20కిపైగా దేశాల నుంచి ఎన్నారైలు, టీడీపీ కార్యకర్తలు భారీగా తరలి వచ్చి స్వాగతం పలికారు. అలాగే వారికి స్విట్జర్లాండ్‌లో భారత రాయబారి మృదుల్ కుమార్ ఘనస్వాగతం పలికారు. అనంతరం సీఎం చంద్రబాబుతో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆయనతో సమావేశం కావడం తనకు ఆనందంగా ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అందుకు సంబంధించిన ఫొటోలను సీఎం చంద్రబాబు నాయుడు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
అలాగే దావోస్ - క్లోస్టర్స్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశం కోసం జ్యూరిచ్ చేరుకున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. 'సంభాషణ స్ఫూర్తి' అనే థీమ్‌తో జరిగే ఈ సమావేశం, భవిష్యత్తును రూపొందించడానికి ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాపార, ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థలు, పౌర సమాజం, విద్యా సంస్థల నుండి నాయకులను ఒకచోట చేర్చే ప్రపంచ వేదిక ఈ ఫోరమని ఆయన అభివర్ణించారు. సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నంతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు.
తన రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ తరపున ప్రాతినిధ్యం వహించడం తనకు గర్వకారణంగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు. స్విట్జర్లాండ్‌లో భారత రాయబారి మృదుల్ కుమార్ తమకు స్వాగతం పలికారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయనకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అసోం సీఎం హిమంత్ బిశ్వాస్‌తో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కవితతో ప్రశాంత్ కిషోర్ వరుస భేటీలు..
శ్రీపంచమి వేళ విద్యార్థులకు గుడ్ న్యూస్.. జస్ట్ చిన్న కండిషన్
For more TG News And Telugu News