City buses: గ్రేటర్‌లో.. తగ్గిన సిటీబస్సులు
ABN , Publish Date - Jan 17 , 2026 | 08:42 AM
గ్రేటర్ హైదరాబాద్లో సిటీ బస్సులు తగ్గాయి. దాదాపు 500 బస్సులను జిల్లాలకు తరలించారు. దీంతో నగరంలో సిటీబస్సులు తగ్గిపోయాయి. సంక్రాంతి పండుగ సెలవులు రావడం, శని, ఆదివారాలు కూడా పాఠశాలలకు సెలవులే కావడంతో చాలామంది ఇంకా ఊర్లల్లోనే ఉండిపోయారు. దీంతో నగరంలో బస్సులను తగ్గించారు.
పండుగకు సమీప జిల్లాలకు..
హైదరాబాద్ సిటీ: నగరంలో సిటీ బస్సులు ఒక్కసారిగా తగ్గాయి. సంక్రాంతి పండుగ(Sankranti festival) రద్దీ నేపథ్యంలో గ్రేటర్‌నుంచి 500కు పైగా సిటీ బస్సులు జిల్లాలకు తరలివెళ్లాయి. వరుస పండుగ సెలవులతో పాటు శని, ఆదివారాలు కలిసి రావడంతో నగరవాసులు పెద్దసంఖ్యలో సొంతూళ్లకు తరలివెళ్లారు. ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉండటంతో గురు, శుక్రవారం తక్కువ సిటీ బస్సులు రోడ్లపైకి వచ్చాయి. గ్రేటర్‌జోన్(Greater Zone)లో ఆర్టీసీ 3,200 బస్సులు నడుపుతుండగా వాటిలో సగం బస్సులు కూడా రోడ్లపైకి రాలేదు. పండుగకు వెళ్లిన వారు తిరిగి నగరానికి వచ్చేందుకు ఎలాంటి అవరోధాలూ తలెత్తకుండా 18, 19 తేదీల్లో జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి.
అవును.. శ్రీరాముడికి బీజేపీ సభ్యత్వం ఉంది
Read Latest Telangana News and National News
