Share News

Travel Alert: సంక్రాంతి ప్రయాణికులకు అలర్ట్.. 500 స్పెషల్ సర్వీసులు

ABN , Publish Date - Jan 17 , 2026 | 08:10 AM

సంక్రాంతి పండక్కి సొంతూర్లకు వచ్చి తిరుగు ప్రయాణం అయ్యే వారికోసం ఆర్టీసీ 500 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. శని, ఆది, సోమ, మంగళవారాల్లో ఈ బస్సులు నడుస్తాయి. ఆదివారం భారీగా బస్సులు నడపాల్సి వస్తుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.

Travel Alert: సంక్రాంతి ప్రయాణికులకు అలర్ట్.. 500 స్పెషల్ సర్వీసులు
Travel Alert

  • నేటి నుంచి నాలుగు రోజులు ఆర్టీసీ స్పెషల్ ఆపరేషన్

  • 500 స్పెషల్స్ నడుపుతున్నట్లు ప్రకటించిన అధికారులు

  • హైదరాబాద్ రూట్‌పై ఎక్కువ దృష్టి

  • హైదరాబాద్ సహా రాయలసీమ, విశాఖకు స్పెషల్ రైళ్లు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): సంక్రాంతి (Sankranti) పండక్కి సొంతూర్లకు వచ్చి తిరుగు ప్రయాణం అయ్యే వారికోసం ఆర్టీసీ 500 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. శని, ఆది, సోమ, మంగళవారాల్లో ఈ బస్సులు నడుస్తాయి. ఆదివారం భారీగా బస్సులు నడపాల్సి వస్తుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. పండుగ ముందు హైదరాబాద్‌కు పెద్దగా బస్సులు నడపని ఆర్టీసీ అధికారులు తిరుగు ప్రయాణాల సందర్భంగా మాత్రం హైదరాబాద్ రూట్‌పై దృష్టి పెట్టారు. పండుగకు ముందు కేవలం 35 స్పెషల్స్ హైదరాబాద్‌కు నడవగా, పండుగ తర్వాత రోజుకు 85కు తగ్గకుండా నడపాలని నిర్ణయించారు.


అదనపు బస్సులు...

హైదరాబాద్ 85 బస్సులు, చెన్నై 10, బెంగళూరు 5 బస్సుల చొప్పున మంగళవారం వరకు నడపాలని భావిస్తున్నారు. అవసరమైతే అదనపు బస్సులు కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. రాజమండ్రి, నరసాపురం, భీమవరం, రాజోలు, అమలాపురం, కాకినాడ, నిడదవోలు తదితర ప్రాంతాల నుంచి పీఎన్బీఎస్‌కు రోజుకు 70 స్పెషల్ బస్సులు నడపాలని నిర్ణయించారు. విజయవాడ నుంచి రాయలసీమ జిల్లాలకు కూడా డిమాండ్‌ను బట్టి స్పెషల్స్ వేస్తారు.


విద్యార్థుల కోసం..

రాయలసీమ నుంచి వేలాదిమంది విద్యార్థులు విజయవాడ పరిసర ప్రాంతాల్లో చదువుకుంటారు. సెలవులు ఇస్తే ఈ రూట్లో రద్దీ ఉంటుంది. అయితే, ఈ నెల 28న జేఈఈ మెయిన్స్ పరీక్షల నేపథ్యంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు అవుటింగ్ ఇవ్వలేదు. దీంతో పెద్దగా రాకపోకలు లేవు. అయినప్పటికీ ఈ మార్గంలో డిమాండ్‌ను బట్టి స్పెషల్స్ నడపడానికి సిద్ధం చేస్తున్నారు.


ప్రత్యేక రైళ్లు కూడా..

తిరుగు ప్రయాణాల నేపథ్యంలో రైల్వే అధికారులు కూడా స్పెషల్ షెడ్యూల్‌ను కొనసాగిస్తూనే అదనంగా మరో రెండు రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించారు. విజయవాడ - గుంతకల్, మచిలీపట్నం - ధర్మవరం స్పెషల్స్ నడుపుతున్నారు. కాకినాడ టౌన్ - చర్లపల్లి మధ్య అదనపు రైళ్లు నడుస్తాయి. విజయవాడ- విశాఖపట్నం 17 జనసాధారణ్ రైళ్లను రైల్వే అధికారులు ఇప్పటికే నడుపుతున్నారు. హైదరాబాద్ - సిర్పూర్ కాగజ్ నగర్, విజయవాడ - హైదరాబాద్, హైదరాబాద్ - విజయవాడ, సిర్పూర్ కాగజ్ నగర్ - హైదరాబాద్‌కు కూడా అదనంగా రైళ్లు నడుపుతారు. విశాఖపట్నం-చర్లపల్లి, చర్లపల్లి - విశాఖపట్నం మధ్య కూడా సంక్రాంతి రైళ్లు నడుస్తాయి.


ఇవి కూడా చదవండి...

సంక్రాంతి వేడుకల పేరిట జూదం, కోడిపందేల హవా

సంక్రాంతి పండుగ రోజు చోరీ.. కేవలం ఒక్కరోజులోనే..

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 17 , 2026 | 08:59 AM