Share News

Godavari Tradition: కొత్త అల్లుడి కోసం అత్తారింట్లో సంక్రాంతి స్పెషల్ విందు

ABN , Publish Date - Jan 16 , 2026 | 08:47 PM

గోదారోళ్ల మర్యాదలు అంటే మామూలుగా ఉండవు మరి.. గోదావరి జిల్లాల ఆతిథ్యం గురించి వింటుంటేనే నోరూరిపోతుంది. కొత్త అల్లుడికి 70 రకాల వంటకాలతో కడియం మండలం జేగురుపాడులో జరిగిన ఈ విందు 'గోదావరి మర్యాద'కు అసలైన నిదర్శనంగా నిలిచింది.

Godavari Tradition: కొత్త అల్లుడి కోసం అత్తారింట్లో సంక్రాంతి స్పెషల్ విందు
Godavari Tradition

తూర్పుగోదావరి, జనవరి16 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లాలో(East Godavari Dist) సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. గోదావరోళ్ల మర్యాద అంటేనే ప్రపంచ వ్యాప్తంగా ఓ బ్రాండ్ ఉంది. ముఖ్యంగా సంక్రాంతి పండుగ (Sankranti Feast) వేళ కొత్త అల్లుడికి ఇచ్చే విందు భోజనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కనుమ పండుగ సందర్భంగా.. కడియం మండలంలో ఓ నూతన అల్లుడి కోసం ఏకంగా 70 రకాల వంటకాలతో రాజ భోజనం సిద్ధం చేశారు. మేక, కోడి, చేపలతో పాటు రకరకాల పిండివంటలతో కూడిన ఈ 'కనుమ విందు' ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


విందు విశేషాలు..

అల్లుడు: తోరాటి శివ సూర్య(నర్సరీ రైతు, దామిరెడ్డిపల్లి)

వంటకాల సంఖ్య: ఏకంగా 70 రకాలు

మెనూలో ఏమున్నాయి..

మాంసాహారం: మేక(మటన్), కోడి(చికెన్), చేపలు, రొయ్యలు, పీతలు.. ఇలా అన్ని రకాల సీఫుడ్ నాన్-వెజ్ వెరైటీలు


పిండి వంటలు..

సంక్రాంతి స్పెషల్ అరిసెలు, బూరెలు, గారెలు, వివిధ రకాల మిఠాయిలు

గోదావరి స్పెషల్స్..

ఆవకాయ నుంచి మొదలుకొని కడియం స్పెషల్ వంటకాల వరకు అన్నీ వడ్డించారు. గోదావరి జిల్లాల్లో ఈ సంప్రదాయం వెనుక ఉన్న అర్థం గోదావరి ప్రజలు అతిథి మర్యాదలకు పెట్టింది పేరు. అల్లుడికి కొసరి కొసరి వడ్డించడం ఎంతో ప్రత్యేకతగా వస్తోంది.


ఆత్మీయతకు ప్రతీక..

70 రకాలు వండటం అంటే అది కేవలం ఆహారం పెట్టడం మాత్రమే కాదు.. అల్లుడిపై ఉన్న ప్రేమను, గౌరవాన్ని చాటుకోవడంగా నిలుస్తోంది.

కనుమ విందు..

సాధారణంగా సంక్రాంతి మూడు రోజుల్లో 'కనుమ' రోజున మాంసాహార విందులు చేయడం ఆనవాయితీ. కొత్త అల్లుడు వచ్చిన మొదటి సంక్రాంతి కావడంతో ఈ వేడుకను మరింత ఘనంగా నిర్వహించారు.


ఎవరీ కొత్త అల్లుడు?

ఈ ప్రత్యేక విందులో పాలుపంచుకున్న కొత్త అల్లుడు విషయం కూడా ఆసక్తికరమే. జేగురుపాడు గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ రంకిరెడ్డి సుబ్రహ్మణ్యం ఆయన కుమార్తె లీలావతిని అదే మండలం దామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన యువ నర్సరీ రైతు తోరాటి శివ సూర్యతో వివాహం జరిపించారు. వీరి వివాహం గతేడాది ఫిబ్రవరి 6వ తేదీన అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత వచ్చిన మొదటి సంక్రాంతి కావడంతో, అత్తారింట్లో కొత్త అల్లుడికి ప్రత్యేక మర్యాదలు చేశారు.


‘ఇవన్నీ అతనొక్కడే తినేస్తారా?’ అనొద్దు!

ఇలాంటి విందు గురించి తెలిసిన వెంటనే కొందరు సరదాగా, ‘ఇవన్నీ అతనొక్కడే తినేస్తారా?’ అని సరదా ప్రశ్నలు వేయడం సహజమే. కానీ గోదావరి జిల్లాల సంగతి తెలిసినవాళ్లకు తెలుసు ఇది తినడం కాదు, ఇది మర్యాద!లో భాగమని..


గోదావరి సంప్రదాయం ప్రకారం..

కొత్త అల్లుడికి విస్తరించి పెట్టడం, అతిథి గౌరవం చూపించడం, పండుగను వైభవంగా జరుపుకోవడం ఇవన్నీ సంస్కృతిలో భాగమేనని గోదావరి జిల్లాల వాసులు చెబుతున్నారు. గోదావరి జిల్లాల్లో పెళ్లి సంబంధాలు, పండుగలు, అల్లుడికి మర్యాదలు అన్నీ ఓ ప్రత్యేక స్థాయిలో ఉంటాయి. ఈ విందుతో మరోసారి ‘గోదావరి మర్యాదలు అంటే ఇలా ఉంటాయి’ అని చాటి చెప్పారు జేగురుపాడు గ్రామస్తులు. గ్రామంలో ఈ విందు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘అల్లుడు అంటే అలా చూసుకోవాలి’ అంటూ పెద్దలు, యువత చర్చించుకుంటున్నారు.


ఇవి కూడా చదవండి...

వైభవంగా ప్రభల ఉత్సవం.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు

సంక్రాంతి పండుగ రోజు చోరీ.. కేవలం ఒక్కరోజులోనే..

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 16 , 2026 | 09:41 PM