Share News

Konaseema Prabhalu Festival: వైభవంగా ప్రభల ఉత్సవం.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు

ABN , Publish Date - Jan 16 , 2026 | 09:40 AM

ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన జగ్గన్నతోట ప్రభల ఉత్సవం అత్యంత వైభంగా జరుగనుంది. ఈ ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

Konaseema Prabhalu Festival: వైభవంగా ప్రభల ఉత్సవం.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు
Konaseema Prabhalu Festival

అంబేద్కర్ కోనసీమ జిల్లా, జనవరి 16: జిల్లాలోని అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో నేడు (శుక్రవారం) ప్రసిద్ధమైన ప్రభల ఉత్సవం అత్యంత వైభవంగా జరుగనుంది. ఈ ఉత్సవం కోనసీమ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఏపీ ప్రభుత్వం ఈ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో ఈసారి మరింత ఘనంగా నిర్వహిస్తున్నారు. సుమారు 450 ఏళ్లు చరిత్ర కలిగిన ఈ సంప్రదాయ ఉత్సవంలో ఏకాదశ రుద్రుల ప్రభలు 11 గ్రామాల నుంచి ఊరేగింపుగా జగ్గన్నతోటకు తరలిరానున్నాయి.


ముఖ్యంగా గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం నుంచి కౌశిక నదిని దాటుకుంటూ గ్రామస్తులు ప్రభలను తీసుకురావడం ఈ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవాలి. వ్యాఘ్రేశ్వరం, కె.పెదపూడి, ఇరుసుమండ, వక్కలంక వంటి గ్రామాల నుంచి కూడా ప్రభలు ఊరేగింపుగా రానున్నాయి. లక్షలాది మంది భక్తులు, పర్యాటకులు తరలిరానున్న నేపథ్యంలో ప్రభుత్వం, స్థానిక అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ప్రభల ఉత్సవానికి ఈ ఏడాది సుమారు 5 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.


జగ్గన్నతోటకు వచ్చే వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. వాహనాల దారి మళ్లింపు చేపట్టారు. భక్తులకు అవసరమైన తాగునీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు కల్పించారు. అలాగే ప్రభల ఉత్సవంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ముందుస్తు జాగ్రత్త చర్యలో భాగంగా వైద్య సిబ్బందిని కూడా ఉంచారు. ప్రభుత్వం ఇచ్చిన రాష్ట్ర పండుగ హోదాతో జగ్గన్నపేట ప్రభల ఉత్సవం ఇకపై ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందే అవకాశం ఉందని స్థానిక ప్రజలు భావిస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

మాట నిలబెట్టుకున్న మచాడో.. నోబెల్​ శాంతి బహుమతి ట్రంప్ కు అందజేత

ఆ కుక్కకు ఏమైంది.. నాలుగు రోజులుగా దేవతల విగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 16 , 2026 | 10:15 AM