Share News

Dogs Doing Parikrama: ఆ కుక్కకు ఏమైంది.. నాలుగు రోజులుగా దేవతల విగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు

ABN , Publish Date - Jan 16 , 2026 | 06:56 AM

ఓ కుక్క గుడి దగ్గరకు వచ్చింది. నేరుగా గర్భగుడిలోకి వెళ్లింది. హనుమాన్ విగ్రహం చుట్టూ తిరగటం మొదలెట్టింది. మూడు రోజుల తర్వాత దుర్గామాత విగ్రహం చుట్టూ తిరుగుతూ ఉంది. నాలుగు రోజులు అయినా కూడా గుడి నుంచి అది పక్కకు రాకుండా తిరుగుతూనే ఉంది.

Dogs Doing Parikrama: ఆ కుక్కకు ఏమైంది.. నాలుగు రోజులుగా దేవతల విగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు
Dogs Doing Parikrama

ఇంటర్నెట్ డెస్క్: గుడికి వెళ్లిన తర్వాత దేవుడ్ని ఏదైనా కోరిక కోరుకోవటం.. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయటం పరిపాటి. అయితే, ప్రదక్షిణలు చేయడానికి ఓ లెక్క అంటూ ఉంటుంది. కోరుకునే కోరికను బట్టి కొంతమంది 100 సార్లకు పైగా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో ఓ కుక్క దేవతల విగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. దాదాపు నాలుగు రోజులు అవుతున్నా ఆ కుక్క మాత్రం గుడి దగ్గరినుంచి పక్కకు రావటం లేదు. తిండి ఆహారాలు మానేసి దేవతల విగ్రహాల చుట్టూ తిరుగుతూ ఉంది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


బిజ్‌నూర్ జిల్లాలోని నందపూర్ గ్రామం, నగినా ఏరియాలో ఓ హనుమాన్ గుడి ఉంది. సోమవారం ఉదయం ఓ కుక్క గుడి దగ్గరకు వచ్చింది. నేరుగా గర్భగుడిలోకి వెళ్లింది. హనుమాన్ విగ్రహం చుట్టూ తిరగటం మొదలెట్టింది. జనం ఆ వింతను చూసి మొదట ఆశ్చర్యపోయారు. ఓ రెండు, మూడు సార్లు తిరిగి అదే అక్కడినుంచి వెళ్లి పోతుందిలే అనుకున్నారు. ఏమీ అనకుండా చూస్తూ ఉన్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. గంటలు గడుస్తున్నా అది విగ్రహం చుట్టూ తిరుగుతూనే ఉంది. మూడు రోజులు గడిచిపోయాయి. అది ప్రదక్షిణలు ఆపేసింది. కొన్ని నిమిషాల పాటు రెస్ట్ తీసుకుంది. అందరూ అది తిరగటం ఆపేసింది అనుకున్నారు.


వారు ఊహించని విధంగా అది మళ్లీ ప్రదక్షిణలు మొదలెట్టింది. ఈ సారి దుర్గామాత విగ్రహం చుట్టూ తిరుగుతూ ఉంది. నాలుగు రోజులు అయినా కూడా అది పక్కకు రాకుండా తిరుగుతూనే ఉంది. ఆ వింత సంఘటనను చూడ్డానికి జనం పెద్ద ఎత్తున అక్కడికి వస్తున్నారు. ఎంతో ఆసక్తిగా కుక్క ప్రదక్షిణల్ని చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై పశువైద్య నిపుణులు స్పందిస్తూ.. ‘ఆ కుక్క కెనైన్ కాగ్నిటివ్ డిస్‌ఫంక్షన్ లేదా వెస్టిబులర్ డిసీజ్ లేదా ఫోకల్ సిజర్స్ లేదా కంపల్సివ్ డిజార్డర్ లేదా బ్రెయిన్ ఇన్‌ఫ్లమేషన్ వల్ల బాధపడుతున్నట్లు ఉంది. అందుకే అది అలా తిరుగుతూ ఉంది’ అని అంటున్నారు.


ఇవి కూడా చదవండి

ఈ రాశి వారు ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక వ్యవహారాల్లో లక్ష్యాలు సాధిస్తారు

సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా స్వర్ణ చంద్రగిరి మండలం: సీఎం చంద్రబాబు

Updated Date - Jan 16 , 2026 | 07:10 AM