Share News

Nobel Peace Prize: మాట నిలబెట్టుకున్న మచాడో.. నోబెల్​ శాంతి బహుమతి ట్రంప్ కు అందజేత

ABN , Publish Date - Jan 16 , 2026 | 08:25 AM

నోబెల్ శాంతి పురస్కారం అందుకోవాలన్న ట్రంప్ కల మొత్తానికి నెవేరింది. గురువారం ఆ పురస్కారాన్ని అందుకున్నాడు.. కాకపోతే అది నోబెట్ కమిటీ వాళ్లు ఇచ్చింది కాదు.. వెనుజువెలా ప్రతిపక్ష నేత మారియా కొరినా మచాడో అందజేశారు.

Nobel Peace Prize: మాట నిలబెట్టుకున్న  మచాడో.. నోబెల్​ శాంతి బహుమతి  ట్రంప్ కు అందజేత
Donald Trump Nobel Peace Prize

ఇంటర్నెట్ డెస్క్: వెనుజువెలా ప్రతిపక్ష నాయకురాలు మారియా కొరినా మచాడో గురువారం వైట్ హౌజ్‌లో ట్రంప్‌ని కలిశారు. ఈ సందర్భంగా తన నోబెల్ శాంతి బహుమతి పురస్కారాన్ని ట్రంప్ నకు అందజేశారు. సమావేశం అనంతరం ఈ విషయాన్ని మచాడో స్వయంగా మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా మచాడో మాట్లాడుతూ.. ‘చరిత్రలో రెండు వందల ఏళ్ల తర్వాత, బొలివర్ వారసులు వాషింగ్టన్ వారసుడికి ఒక పతకాన్ని తిరిగి ఇస్తున్నా.. ఇది మన స్వేచ్చ పట్ల ఆయన ప్రత్యేక నిబద్ధతకు గుర్తింపుగా నా నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్ నకు అందజేస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. వెనుజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను ఇటీవల అమెరికా సైనిక దళాలు అదుపులోకి తీసుకున్న కొన్ని రోజులకే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

tramp.jpg


మచాడోతో భేటీ అనంతరం ట్రంప్ స్పందిస్తూ.. ‘మారియా కొరినా మచాడోను కలవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆమె ఎన్నో కష్టనష్టాలను ఎదిరించి నిలిచిన గొప్ప మహిళ, ఇన్నాళ్ళు ప్రపంచ శాంతి కోసం నేను చేసిన కృషిని గుర్తించి ఆమె తన నోబెల్ పురస్కారాన్ని నాకు బహుమతిగా ఇచ్చారు.. థ్యాంక్యూ మరియా.. అంటూ తన ట్రూత్ సోషల్ వేదికగా తెలిపారు. గత ఏడాది అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని.. దానికి తాను పూర్తి అర్హుడని నానా హంగామా చేశారు. కానీ, నోబెల్ బహుమతి మాత్రం ట్రంప్‌నకు దక్కలేదు. 2025 లో నోబెల్ బహుమతి వెనుజువెలా ప్రతిపక్ష నేత కొరినా మచాడోకి దక్కింది.


ఇవి కూడా చదవండి..

చైనా-పాక్ ఒప్పందం చెల్లదు.. ఆ వ్యాలీ భారత్‌కు ఎందుకు కీలకం..

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jan 16 , 2026 | 08:49 AM