Share News

26-26 ఉగ్ర కుట్రకు ప్లాన్.. నిఘా వర్గాలు అప్రమత్తం

ABN , Publish Date - Jan 21 , 2026 | 05:34 PM

నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తమైన అధికారులు జమ్మూకశ్మీర్, ఢిల్లీ, పంజాబ్ వంటి కీలక ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. పలువురు అనుమానితుల పోస్టర్లను ఢిల్లీలో పలు చోట్ల ఏర్పాటు చేశాయి. ప్రధానంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాల్లో వీటిని ఉంచారు.

26-26 ఉగ్ర కుట్రకు ప్లాన్.. నిఘా వర్గాలు అప్రమత్తం
Republic Day

న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day) లక్ష్యంగా చేసుకుని భారత్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశాలున్నాయని నిఘా వర్గాల తాజా సమాచారం. ఈ సమాచారంతో ఢిల్లీలో భద్రతా బలగాలు బుధవారంనాడు అప్రమత్తమయ్యాయి. పాకిస్థాన్‌ నిఘా సంస్థ ఐఎస్ఐ ఈ ఉగ్రదాడులకు సహకరించనున్నట్టు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. జనవరి 26న దేశంలోని పలు ప్రాంతాల్లో జరిపే ఈ దాడులకు '26-26' అనే కోడ్ నేమ్ పెట్టినట్టు తెలిపాయి.


దేశంలోని పలు ఆలయాలు, నగరాలతో పాటు అయోధ్యలోని రామాలయం, జమ్మూలోని రఘునాథ్ ఆలయం ఉగ్రవాదుల టార్గెట్‌లో ఉన్నట్టు భద్రతా బలగాలు తెలిపాయి. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (JeM), పంజాబ్‌ బేస్డ్ గ్యాంగ్‌స్టర్లతో ఐఎస్ఐ ఈ ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్నట్టు పేర్కొన్నాయి. గత నవంబర్‌లో ఎర్రకోట వెలుపల జరిగిన కారుబాంబు పేలుడు ఘటన వెనుక జైషే మహ్మద్ ఉంది.


కాగా, నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తమైన అధికారులు జమ్మూకశ్మీర్, ఢిల్లీ, పంజాబ్ వంటి కీలక ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. అనుమానితుల పోస్టర్లను ఢిల్లీలో పలు చోట్ల ఏర్పాటు చేశారు. ప్రధానంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాల్లో వీటిని ఉంచారు.


గత ఏడాది ఏప్రిల్‌లో లష్కరే తొయిబా ఉగ్రసంస్థ పహల్గాంలో జరిపిన ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. గత వారం లష్కరే సంస్థ జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదానికి కట్టుబడి ఉన్నామని బహిరంగంగా ప్రకటించింది. హిందువులకు వ్యతిరేకంగా లష్కరే కమాండర్ విద్వేషపూరిత ప్రసంగం చేశాడు. హిందువుల కుత్తుకలు కోసినప్పుడే 'ఫ్రీడం' సాధ్యమని పీఓకేలో జరిగిన ఒక కార్యక్రమంలో అబూ మూసా కశ్మీరీ చేసిన ప్రసంగం వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. పహల్గాం ఉగ్రదాడికి ముందు కూడా కశ్మీరీ ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. దీంతో భారత్‌పై దాడులకు మరింత భారీ కుట్ర చేసే అవకాశాలు ఉండవచ్చని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి.

ఉద్ధవ్‌కు షాక్.. షిండే వర్గానికి మద్దతు ప్రకటించిన ఎంఎన్‌ఎస్

తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఎన్డీయేలోకి టీటీవీ దినకరన్

Read Latest National News

Updated Date - Jan 21 , 2026 | 05:52 PM