Share News

కూలిన మిలటరీ శిక్షణ విమానం.. కొనసాగుతున్న సహయక చర్యలు

ABN , Publish Date - Jan 21 , 2026 | 01:19 PM

ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్ రాజ్‌లో మిలటరీ శిక్షణ విమానం కూలిపోయింది. ప్రయాగ్ రాజ్ నగర శివారులోని చెరువులో ఈ మిలటరీ శిక్షణ విమానం కూలింది. ఈ ఘటనపై సమాచారం అందగానే.. ఆర్మీ అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సహయక చర్యలు చేపట్టారు.

కూలిన మిలటరీ శిక్షణ విమానం.. కొనసాగుతున్న సహయక చర్యలు

లక్నో, జనవరి 21: ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్ రాజ్‌లో మిలటరీ శిక్షణ విమానం కూలింది. ప్రయాగ్ రాజ్ నగర శివారులోని చెరువులో ఈ శిక్షణ విమానం కూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందగానే.. ఆర్మీ ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. చెరువులోని ఎయిర్ క్రాఫ్ట్‌ నుంచి పైలట్లను బయటకు తీశారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆర్మీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇరాన్‌కు ట్రంప్ మళ్లీ వార్నింగ్.. కుట్ర చేశారో..

పోటాపోటీగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు..

For More National News And Telugu News

Updated Date - Jan 21 , 2026 | 02:34 PM