Bengaluru News: ఆలయం ముందు ముళ్ళపొదల్లో.. ఆడశిశువు
ABN , Publish Date - Dec 31 , 2025 | 11:49 AM
ఆలయం ముందు ఆడశిశువును వదిలివెళ్లిన సంఘటన కర్ణాటక రాష్ట్రం కొప్పళ(Koppala) జిల్లాలో చోటుచేసుకుంది. అక్కడగల హులిగమ్మ దేవాలయం ఆవరణం సమీపంలో ఓ ముళ్ళపొదల్లో నవజాత ఆడశిశువు ఉండటాన్ని దేవాలయంలో పనిచేస్తున్న హోంగార్డు కాపాడి మానవత్వం చాటుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.
- హులిగమ్మ ఆలయం వద్ద అమానుషం
- ముళ్లపొదల్లో గుర్తించిన హోంగార్డు
- కొప్పళ ఆస్పత్రికి తరలించి చికిత్స
- తల్లిదండ్రుల కోసం ఆరా
బళ్లారి(బెంగళూరు): ఆలయం ముందు ఆడశిశువును వదిలి వెళ్లడం కలకలం రేపింది. కొప్పళ జిల్లా, మునిరాబాద్ పరిధిలోని హులిగమ్మ దేవాలయం ఆవరణం సమీపంలో ఓ ముళ్ళపొదల్లో నవజాత ఆడ శిశువును దేవాలయంలో పనిచేస్తున్న హోంగార్డు కాపాడి మానవత్వం చాటుకున్నారు. మంగళవారం హులిగమ్మ దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న మారుతి అనే హోంగార్డు.. సమీపంలోని ముళ్ళపొదల నుంచి అరుపులు వినిపించడంతో అశ్చర్యపోయారు. దగ్గరకు వెళ్లి చూడగా నవజాత ఆడ శిశువు ఏడుస్తూ కనిపించండంతో ఎత్తుకుని అలయ అధికారులకు అప్పగించారు. అధికారులు సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స అందజేశారు. అమ్మపాల కోసం తపిస్తూ ఆడ శిశువు ఏడుపును ఎవరూ ఆపలేక పోపారు. చికిత్స అనంతరం శిశువు ఏడుపు ఆపి ప్రశాంతంగా నిద్రపోయింది.

ఎవరు వదిలేశారు..?
శిశువును ఎవరు వదిలేశారనేది ప్రశ్నార్థకంగా మారింది. తల్లిదండ్రులు, బంధువుల హస్తం ఉందా, లేక ఎవరైనా కుట్రపూరితంగా వదిలేశారా అన్నది తేలాల్సి ఉంది. నిత్యం దేవస్థానానికి కర్ణాటకతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి అశేష భక్త జనం హులిగమ్మ దర్శానికి వచ్చి వెళుతుంటారు. అలాంటి పవిత్రమై దేవస్థానంలో సమీపంలోనే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం అందరి మనస్సు కలిచి వేస్తోంది. నవజాత శిశువుకు చికిత్స అందజేసిన వైద్యులు శిశువు 2కిలోల 400 గ్రాములు ఉన్నట్లు తెలిపారు.
హోంగార్డు మారుతి సమయస్పూర్తితోనే ఆడ శివువు ప్రాణాలతో నిలిచిందని, ముళ్ళపొదల నడుమ శిశువును విడిచి వెళ్ళిన కారనణంగా చీమలు, పురుగులు కుట్టడం కారణంగా శరీరంపై గాయాలై ఉండవచ్చని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ గిరీష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పిల్లల రక్షణా విభాగం అధికారులు ఆసుపత్రికి విచ్చేసి ఆడశిశువు గురించి విచారణ జరిపారు. శిశువు తల్లితండ్రుల గురించి ఆరా తీస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒక వేళ శిశువు పోషకులు లభించక పోతే శిశువును దత్తత ఇచ్చే ప్రక్రియ జరపనున్నట్లు పిల్లల రక్షణా విభాగం అధికారులు తెలిపారు. పవిత్ర స్థలంలో ఇలాంటి ఘటనపై అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కల్తీ నెయ్యి కేసులో వేమిరెడ్డి ప్రశాంతి విచారణ
మద్దతు ధరకు పప్పుధాన్యాల కొనుగోలు
Read Latest Telangana News and National News